తెలుగు చలనచిత్ర సీమలో మహానటుడిగా పేరు తెచ్చుకున్నారు నటసార్వభౌములు నందమూరి తారక రామారావు.  సాంఘిక,పౌరాణిక,జానపద చిత్రాల్లో ఆయన వేయని పాత్రలు లేవు..ప్రతి పాత్ర ఆయన కోసమే సృష్టించబడ్డాయా అన్న రీతిలో నటించి మెప్పించారు.  అంతే కాదు రాముడు, కృష్ణుడు గానే కాదు దుర్యోదనుడు,రావణాసుడు కూడా ఇలా ఉంటారా అన్న రీతిలో అద్భుతమైన నటన ప్రదర్శించారు. అందుకే ఆయన తెలుగు చలన చిత్రం ఉన్నంత కాలం స్మరించుకుంటూనే ఉంటారు.  

ఇక సినిమాల్లో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో..రాజకీయాల్లో కూడా అంతే గొప్ప పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.  తెలుగు ప్రజలు ఆయను అన్నా అంటారు..అప్పట్లో ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతుండేది. రాజకీయ పరంగా తెలుగు వారిపట్ల తక్కువ చూపు చూడటం ఎన్టీఆర్ సహించలేక పోయారు..దీంతో కొత్తగా ‘తెలుగు దేశం’ పార్టీ స్థాపించి అచిరకాలంలోనే సీఎం గా పదవీ భాద్యతలు స్వీకరించారు.
Image result for sr ntr politics
పల్లె పల్లెల్లో తెలుగు దేశం జెండా ఎగురవేశారు.. ప్రజలతో మమేకమవుతూ..వారి భాదలు తీరుస్తూ కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు.  ఎన్టీఆర్ కొంత మంది లంబాడీలతో తీన్మార్ వేస్తున్న అపూర చిత్రం మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: