జ‌న‌సేన నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మ‌ధ్య కాలంలో రాజ‌కీయంగా దూకుడు పెంచారు. అఫ్ కోర్స్ 2019 ఎన్నిక‌ల్లో పార్టీ రాజ‌కీయ పోటీకి దిగుతుంద‌ని ఆయనే చెప్పారు. అదివేరే విష‌యం. అయితే తాజాగా త‌న అన్న‌య్య చిరంజీవి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ద‌గ్గ‌రయ్యేందుకు చాలా ప్ర‌య‌త్నాలే చేస్తున్నార‌న్న వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పవన్  మొదట్లో అతన్ని చాలా తేలిగ్గా తీసుకున్న వారంతా ఆయనకు దక్కుతున్న జనాదరణ, ఆయన అవలంబి స్తున్న రాజకీయ ఎత్తుగడలు చూసి నోరెళ్లబెడుతున్నారు.
 
అలా వచ్చాడు.. అలానే వెళ్ళిపోతాడు అనుకుంటే పాతుకుపోతున్నాడే అనుకుంటున్నారు. పవన్ కూడా మొదట్లో పెద్దగా స్థిమితం లేని అడుగులే వేసినా ఇప్పుడు మాత్రం గుర్తులు మిగిలిపోయేలా కదులుతున్నాయి. పార్టీ మొద‌లు పెట్టిన స‌మ‌యంలో టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చి తన బలమెంతో తానే పరీక్షించుకునే పవన్ ఆ తర్వాత వారి నుండి దూరంగా జరిగి ప్రజా సమస్యలపై గళమెత్తుతూ పార్టీని 2019 ఎన్నికల కోసం సంసిద్ధం చేసుకుంటున్నారు. అందుకే సంస్థాగత నిర్మాణం బలంగా ఉండేలా చూసుకుంటు న్నారు. 

అందులో భాగంగానే ప్రధాన బాలల్లో ఒకటైన మీడియాను పక్కన చేర్చుకుంటున్నారు. అందుకు నిదర్శనమే ‘కాటమరాయుడు’ ఈవెంట్లో టీవీ 9 రవిప్రకాష్, ఎన్ టీవీ చౌదరిలు హాజరు. ఈ పరిణామాన్ని బట్టి చూస్తే ఈ రెండు బడా చానళ్లు ఇక నుండి పవన్ పక్షం వహించడం ఖాయమని తేలిపోయింది. ఈ హఠాత్పరిణామానికి ఖంగుతిన్న ప్రత్యర్థులు పవన్ లో ఇంత విజ్ఞానానికి, రాజకీయ చతురతకు కారణాలు ఏమిటా అనే ఆలోచనలో పడ్డారు. 

కొందరైతే అన్నయ్య చిరంజీవి ఇచ్చిన సలహాలు కూడా పవన్ పరిణితికి కారణమని అంటున్నారు. అందులో నిజం లేకపోలేదు కూడా. 2009లో ప్రజారాజ్యం తరపున ఎన్నికల్లోకి దిగిన చిరు తప్పని ఒంటరి పోరు వలెనే ఓడిపోయారు. అప్పటి అధికార పక్షం ఆయనకు కనీస మీడియా మద్దత్తు లేకుండా చేసింది. చిరు రాజకీయ చేదు అనుభవాన్ని చవి చూడడానికి అది కూడా ఒక కారణం.

అందుకే చిరు ముందుగా బలాన్ని కూడగట్టుకోమని పవన్ కు సలహా ఇచ్చి ఉండొచ్చు. అంతర్గతంpగా తన వంతు సహాయం కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే పవన్ రాజకీయ ప్రవేశం పై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తప్పకుండా అతను సక్సెస్ అవుతాడని బహిరంగంగానే చెప్పిన చిరు తమ్ముడికి సలహాల సాయం అయితే చేయకుండా అయితే ఉండరు. ఇందంతా ఒక్క‌తైతే చిరు ప‌వ‌న్ కు చెప్పిన స‌ల‌హా సూచ‌న‌లు ఎమి ఉంటాయోన‌ని ప‌లువురు చెవులు కోసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: