తెలంగాణ అసెంబ్లీలో నేడు గందరగోళం చోటు చేసుకుంది.   మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో మంత్రి హరీశ్ రావు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్‌కు సూచనలు చేశారు. ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.   స్పీకర్ మధుసూదనాచారి వారిపై 2 రోజులు సస్పెన్షన్ వేటు విధించారు.
Image result for telangana assembly
సస్పెండ్ కి గురైన బీజేపీ సభ్యులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, ప్రభాకర్, రాంచంద్రారెడ్డిలు ఉన్నారు.   వారిపై 2రోజులపాటు సస్పెన్షన్ విధించినట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ విధించడంపై సీనియర్ ఎమ్మెల్యే జానారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా, ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ, సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు.

నిరంకుశ ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలే కాని, సస్పెండ్ చేయకూడదని చెప్పారు. ధర్నా చౌక్ ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడే నిరసన కార్యక్రమం చేపట్టే వారని... ధర్నా చౌక్ లేకపోవడంతోనే వారు అసెంబ్లీలో ఆందోళన చేశారని అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ..కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: