అగ్రిగోల్డ్ వ్యవహారం ఆంధ్రా అసెంబ్లీలో పెను ప్రకంపనలు సృష్టించింది. అధికార ప్రతిపక్షాల పరస్పర నినాదాలతో హోరెత్తింది. మంత్రి పత్తిపాటి పుల్లారావు, విపక్షనేత జగన్ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు చెందిన భూమిని మంత్రి పత్తిపాటి కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారంటూ విపక్షనేత జగన్ వ్యాఖ్యలు చేయటంతో స్పందించిన మంత్రి పత్తిపాటి అగ్రిగోల్డ్‌ సంస్థకు సంబంధించిన భూములను తాను కొన్నట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్‌ చేశారు. 



పుల్లారావు చేసిన సవాల్‌ను జగన్‌ స్వీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.  విపక్షం కోరుకున్నట్లుగా మంత్రిపై వచ్చిన ఆరోపణలపై జ్యుడిషియల్‌ విచారణ చేయిస్తామని.. జగన్‌ ఆరోపణలు నిజమైతే పుల్లారావు సభ నుంచి వైదొలగుతారని.. తప్పయితే జగన్‌ వెళ్లిపోవాలని అన్నారు. పుల్లారావో.. జగనో.. ఎవరో ఒక్కరే సభలో ఉండాలని చంద్రబాబు తేల్చిచెప్పారు..



మరింత సమాచారం తెలుసుకోండి: