జగన్ నోట మరోసారి ముఖ్యమంత్రి మాట వచ్చేసింది.. ఒక్క రెండేళ్లు కళ్లుమూసి నేనే అధికారంలోకి వస్తా.. అప్పుడు మీకు న్యాయం చేస్తానంటూ అగ్రోగోల్డ్ బాధితులకు ఆయన భరోసా ఇచ్చారు. శాసనసభ నుంచి వైసీపీ ప్రతినిధులు వాకౌట్‌ చేసిన తర్వాత అగ్రిగోల్డ్ శిబిరం వద్దకు ప్రతిపక్ష నేత జగన్‌సహా ఆ పార్టీ ఇతర నేతలు తరలివచ్చారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలతో కలిసి బాధితులకు సంఘీభావం ప్రకటించారు. 



అగ్రిగోల్డ్ బాధితులకు నిమ్మరసం ఇచ్చి రిలేదీక్షలు, నిరవధిక దీక్షలు చేస్తోన్న వారి ఆందోళనను విరమింప జేవారు. శాసనసభలో అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య వినడానికి ప్రభుత్వానికి మనసురాలేదని జగన్‌ అన్నారు. మంత్రి పుల్లారావుతోను, అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌ సోదరుడి సీతారామ్‌ తనకు ఎలాంటి శత్రుత్వం లేదని  అగ్రిగోల్డ్‌ బాధితులకు తమ పార్టీ భరోసాగా ఉంటుందని అన్నారు. 



అగ్రిగోల్డ్ బాధితుల తరపున వైసీపీ పోరాటం చేస్తుందని జగన్ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్‌ బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తామన్నారు జగన్‌. ఐతే తమను అధికార, ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయేమో అన్న ఆందోళన అగ్రిగోల్డ్ బాధితుల్లో కనిపించింది. 



మంత్రి పుల్లారావుపై విమర్శలు చేస్తోన్న జగన్‌ తమ పార్టీకి చెందిన నేత భూమి కొనుగోలుపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. తమకు న్యాయం చేసేందుకు సహకరించాలి తప్ప రాజకీయంగా వాడుకోవద్దని  కోరారు. మరి నిజంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేదెన్నడో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: