Image result for sakshi media


మీడియా అంటే మీడియానే. అది కొన్నిసార్లు కొరివి మరి కొన్నిసార్లు కోతి.  రాజకీయ నాయకులకు తగలడ్డా, తల గొరిగినా రెండూ దెబ్బే. మీడియా మనచేతులో ఉందని అన్నీ చొట్ల వాగినంత వాగి కవర్ చేసుకోవాలని చూసుకుంటే సాక్షేకాదు ప్రతి చిన్న పత్రిక లేదా చానల్ కూడా వాయించెయ్య గలదు. ఈ రోజు మన వాళ్ళ మీడియా మనకు తోడున్నా భవిష్యత్ లో మరొకరు పవర్ఫుల్ కావచ్చు.  


అగ్రిగోల్డ్‌ కుంభకోణానికీ, స్పీకర్‌ కోడెలపై సాక్షి కథనాలకీ సంబంధం లేదని చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు, అయిందానికి కానిదానికి సాక్షినో మరొకరినో ఆడిపోసుకునే  అధికార తెలుగుదేశం పార్టీ  కి అప్రతిష్ఠ తప్ప మిగిలేదేముంది.  మీది రైటని మీరనుకునేటప్పుడు ప్రజాస్వామ్యములో మరొకరు వారిది రైటనుకుంటారు. ఆ “స్పేస్”  అందరికి ఉంచటం అధికారపక్ష పార్టికి చాలా అవసరం.


Image result for sakshi media


అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌  'మీట్‌ ది ప్రెస్‌' లో ఏం చెప్పారో ప్రపంచమంతా చూసింది.  ఉద్దేశ్యం ఏదైనా కావొచ్చుగాక, 'కారు షెడ్‌లో వుంటే సేఫ్‌.. అలాగే అమ్మాయిలు కూడా..' అన్న కోడెల శివప్రసాద్‌ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత, దానికన్నా ముందు కోడెల స్పీచ్‌లో చాలా విషయాలున్నాయి.


కానీ, 'కారు - షెడ్‌ - అమ్మాయిలు - బయట తిరగడం' అన్న వ్యవహారమ్మీదే మీడియా ఎక్కువ ఫోకస్‌ పెట్టింది.  దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై పెద్ద రచ్చే జరిగింది. తెలుగు మీడియాలోనూ తక్కువ రచ్చ ఏమీ జరగలేదు. దాదాపుగా అన్ని ఛానళ్ళూ ఈ వ్యవహారాన్ని 'కవర్‌' చేసేశాయి.. విశ్లేషణలతో దంచి కొట్టేశాయి. కానీ, ఇక్కడ కేవలం 'సాక్షి' మీదనే అధికార పార్టీ కత్తిగట్టేసింది.  కోడెల ఆ వ్యాఖ్యలు చేశారు.  ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఈ రోజు అసెంబ్లీలో ప్రదర్శించిన వీడియోలోనూ అదే కన్పించింది.


Related image


ఇక, సాక్షి ఈ ఉదంతంపై నేషనల్‌ మీడియా, తెలుగు మీడియా ప్రసారం చేసిన కథనాల్ని ఉటంకిస్తూ మరో కథనాన్ని వండి వడ్డించింది తాజా తాజాగా. ఇప్పుడిక, అధికార పార్టీ నేతల గొంతులో పచ్చివెల క్కాయ పడిందనే చెప్పాలి. సాక్షిని బ్యాన్‌ చేయాలనుకుంటే. మొత్తంగా మీడియాని బ్యాన్‌ చేసెయ్యాలి.  లేదంటే, అందర్నీ వదిలెయ్యాలి.


'నేషనల్‌ మీడియాకి వాస్తవం చెప్పాం.. వాళ్ళు ఆ కథనాల్ని ఆపేశారు..' అంటూ చంద్రబాబు, నాలిక్కర్చు కున్నారుగానీ.  ఈ  బ్లేమ్‌ గేమ్‌ అచ్చంగా 'హిట్‌ వికెట్‌' లాంటిదే నని టీడీపీ నేతలకు అర్థమయి పోయింది. ఇప్పుడేమో ముందుకు వెళ్ళలేరు.. వెనక్కి రాలేరు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్‌ ఈ వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేసేశారు గనుక. ఇది స్పీకర్‌ ఛెయిర్‌కి సంబంధించినంతవరకు 'ప్రెస్టీజ్‌ ఇష్యూ'గా మారిపోయింది.  టీడీపీ అలా మార్చేసింది. కానీ, పరిస్థితులు అనుకూలించవాయె.!


సాక్షి మీద చర్యలు తీసుకోకపోతే.. స్పీకర్‌ ఆవేదనకు అర్థం వుండదు. చర్యలు తీసుకుంటే, మొత్తం మీడియా, చంద్రబాబు సర్కార్‌ని ఏకి పారేస్తుంది.. నేషనల్‌ మీడియాతో సహా. నేషనల్ మీడియాతో పెట్టుకుంటే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. చంద్రబాబు భలేగా ఇరుక్కున్నారిక్కడ.  


Image result for national media

నేషనల్ మీడియా గాని ప్రాంతీయ మీడియా గాని రాజకీయాల్నే కాదు ఎవరినీ వదలదు. ఇవ్వాళ కాకపోతే రేపు.

మరింత సమాచారం తెలుసుకోండి: