ఈ మద్య కాలంలో తమిళనాడు రాష్ట్రంలో విపరీతమైన కరవు సంబవించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గత సంవత్సరం వరదలతో అష్టకష్టాలు పడ్డ రైతులు నేడు కరువుతో అల్లలాడుతున్నారు.  దీంతో రైతులకు మద్దతు గా సినీ నటులు రోడ్డెక్కారు.   గత కొంత కాలంగా తమిళనాడులో రాజకీయ గొడవలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రైతుల గోడు పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇక హీరో విశాల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్.. ఇద్దరూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు.  అప్పటికే అక్కడకు భారీ సంఖ్యలు రైతులు వచ్చి చేరారు. విశాల్, ప్రకాష్ రాజ్ లు నల్ల దుస్తులు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు.  అంతే కాదు రైతులను ఆదుకోవాలని వారికి అనుకూలంగా అనుకూలంగా నినాదాలు చేశారు.  

మరోవైపు రైతులు కూడా మెడలో కపాలాలు ధరించి తమిళనాడులో కరువు తీవ్రత ఎంత ఘోరంగా ఉందూ కళ్లకు కట్టినట్లు చూపించారు.  తమ నిరసనలతోనైనా సంబంధిత మంత్రులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: