అగ్రిగోల్ద్ అంశంలో బాధ్యులను టీడీపీ ప్రభుత్వం కాపాడుతుందని జగన్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ పై విమర్శలు కురిపిస్తుంటే..ప్రతిపాటి పుల్లారావు దానికి రివర్స్ పంచ్ గా దానికి సవాల్ గా స్వీకరించే దమ్ము మీకుందా..? అని పుల్లారావు సవాల్ విసిరితే జగన్ అసెంబ్లీ నుండి పారిపోయాడని పుల్లారావు జగన్ పై సెటైర్ వేస్తే దానికి రివర్స్ పంచ్ గా జగన్ నేడు అసెంబ్లీ లో అగ్రీగోల్డ్ ఆస్తులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేశారన్న జగన్ ఆరోపణలపై, సవాళ్లు, ప్రతి సవాళ్లు అసెంబ్లీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్న వేళ, మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..


Image result for achennayudu

జగన్ గారు మీరు అమూల్యమైన ప్రజా సమయాన్ని వృథా చేస్తున్నారు. నేను సూటిగా ప్రతిపక్ష నాయకుడిని అడుగుతున్నాను.. ఈ సభకు క్షమాపణ చెబుతారా..? లేక సవాల్ కు సిద్ధ పడతారా..? శరణమా? సమరమా? ఏదో ఒకటి చెప్పండి. రెండు నిమిషాల్లో తేలాలి.  జగన్ కు సభ మీద గౌరవం లేదని చంద్రబాబు అన్నారు. పుల్లారావుపై పదే పదే జగన్ ఆరోపణలు చేశారని అన్నారు. గుడ్డకాల్చి మీద పడేయడం సరికాదన్నారు. పుల్లారావు తప్పుచేయలేదని చెప్పినా.. ఆరోపణలు చేశారని మండిపడ్డారు.


Image result for achennayudu

జగన్ జూడీషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తే.. తాను అంగీకరించానని చంద్రబాబు చెప్పారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... తాను చేసిన ఆరోపణలు నిరూపించకపోతే శాసనసభకు క్షమాపణలు చెప్పాలన్నారు. అలాగే అనవసర ఆరోపణలతో సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మాణిక్యాలరావు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: