ఇదిగో సాక్ష్యం, లోకేష్ హస్తం...


ఏపీలో జరిగిన అగ్రిగోల్డ్ కుంభకోణం బోఫోర్స్, స్పెక్ట్రం, కోల్ స్కాం కంటే ఎంతో పెద్దది అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ పెద్ద స్కాం అన్నారు. ఇందులో పత్తిపాటి చీమ అని, ఎంపీలు, చంద్రబాబు కొడుకు హస్తం ఉందని చెబుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.


జగన్ తీరు భరించలేకపోయా..


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ శాసన సభలో మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం తీర్మానం ప్రవేశ పెట్టారు. మంత్రి పత్తిపాటి పుల్లారావుపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనిని ప్రవేశ పెట్టారు. అసమర్థ ప్రతిపక్ష నేత వల్ల సభా సమయం వృథా అవుతుందని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నేతకు అలవాటుగా మారిందన్నారు. పత్తిపాటిపై చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని చెప్పి, ప్రతిపక్షం వెనక్కి పోతోందన్నారు.


జగన్ ఆన్‌లైన్‌లోకి వెళ్లి చూడు...


అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేశారంటూ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. అసలు అగ్రిగోల్డ్ సంస్థకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అగ్రిగోల్డ్ ప్రొఫెషనల్ డైరెక్టరుగా వున్న ఉదయ్ దినకర్ దగ్గర 6 ఎకరాలు కొన్నది నిజమేనని అన్నారు. ఐతే ఆయన వేరేవాళ్ల దగ్గర కొని తమకు అమ్మారని అన్నారు. ఆయన అగ్రిగోల్డ్ సంస్థలో వాటాదారు కానీ ప్రమోటర్ కానీ కాదన్నారు.


మరింత వేడెక్కనున్న తెలంగాణ


తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశమున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్‌, అదిలాబాద్‌, భద్రాచలం జిల్లాల్లో అత్యధికంగా 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నిజామాబాద్‌, హైదరాబాద్‌, అదిలాబాద్‌, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో మరో మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉ‍న్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 


పంది మాంసం తినండి, ఆరోగ్యంగా ఉండండి’

జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్షయవ్యాధి దినం...సందర్భంగా జిల్లాలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
‘‘అధిక ధరలతో లభించే మటన్, చికెన్ ల కంటే అడవి పంది మాంసాన్ని తినాలి. జిల్లాలో అడవి పందులు చాలా ఉన్నాయి. అడవి పందులను పట్టి తినడం తప్పుకాదని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఊరూరా అడవి పందులు తినాలి. దాని వల్ల ఏలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఆరోగ్యానికి మంచిది. విదేశాల్లో అడవి పంది మాంసానికి బాగా డిమాండ్ ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: