ఒక వైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటుంటే మరో వైపు అతనిపై విమర్శల దాడి ఎక్కువ అవుతుంది. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత హిట్ అయిందో, దాని సీక్వెల్ సర్దార్ గబ్బర్ సింగ్ అంత ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా నిజాం హక్కులను సొతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు ఎదురయ్యాయి. దాని వల్ల వారికి కోట్ల రూపాయల నష్టం వచ్చింది.


Image result for kamla aar khan pavan kalyan

అయితే ఆ నష్టాన్ని పవన్ కాటమరాయుడు సినిమా ప్రచార హక్కుల్ని తమకు ఇస్తామని హామీ ఇచ్చి తీరా సమయానికి వచ్చే సరికి హ్యాండ్ ఇచ్చారని వారు ఇప్పుడు కూడా ఫిల్మ్ నగర్ లో నిరాహార దీక్ష చేబడుతున్నారని, పవన్ కళ్యాణ్ వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడని ప్రముఖ సినీ విమర్శకుడు, బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఓ ఫ్లాప్ హీరో అని అతను అన్నాడు. అంతేకాదు, 'అతను ఓ పెద్ద మోసగాడు కూడా' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని...


Image result for kamla aar khan

డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్ ను పవన్ కల్యాణ్ రూ. 8 కోట్ల మేర మోసం చేశాడని ఆరోపించాడు. ఆంధ్రప్రదేశ్ లో సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల రూ. 2 కోట్లు నష్టపోయిన ఓ డిస్ట్రిబ్యూటర్ గత 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడంటూ... అతని ఫొటోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. 'కాటమరాయుడు' సినిమాను హిందీలో విడుదల చేస్తామని చెప్పడాన్ని ఎద్దేవా చేశాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: