సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కుతున్నా మనుషుల ఆలోచనలు మాత్రం వింత పోకడలు తొక్కుతున్నాయి. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. బుద్ధిగా, పద్దతిగా చదువుకొని భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వేయాల్సిన వయసులో 14 సంవత్సరాల ఒక బాలుడు చేయకూడని తప్పు చేసి, దానికి ప్రతిఫలంగా రెండు నెలల బిడ్డకు తండ్రి అయ్యాడు. పట్టుమని పదహారేళ్లు కూడా నిండనే లేదు. అప్పుడే ఒక బాలుడు తండ్రి కావడం ఏంటని సభ్య సమాజం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. తల్లి దండ్రుల నిర్ల్యక్ష ధోరణి కూడా ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతోంది.


Image result for 14 years boy shadow

పిల్లలు పెరిగే వయసులో వారిని అనుక్షణం కనిపెట్టాల్సిన తల్లి దండ్రులు వారి వారి పనుల్లో బిజీ అయిపోయి పిల్లలు ఏం చేస్తున్నారు..? ఎటు వెళ్తున్నారు..? అని పట్టించుకోవడమే మాసేశారు. వారు చేసిన ఈ తప్పే బాలుడు మరో పెద్ద తప్పు చేసేలా ప్రేరేపించింది. ఇంతకీ అసలు విషయానికి వస్తే.. కేరళా రాష్ట్రంలో చోటుచేసుకుంది ఈ ఘటన. ఆ  ప్రాంతంలోని ఓ పాఠ‌శాల‌లో 8వ తరగతి చదివే ఓ బాలుడు తనకంటే నాలుగేళ్లు పెద్దదయిన ఓ యువతిని ప్రేమించాడు.


Image result for 14 years boy shadow

వారి ప్రేమ‌కు చిహ్నంగా వారికి ఓ పాప పుట్టింది. ప్ర‌స్తుతం ఆ పాపకు రెండు నెలలు. అయితే, ఆ బాలుడు తనపై అత్యాచారం చేశాడని స‌ద‌రు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ అంశం వార్త‌ల్లోకెక్కింది. డీఎన్‌ఏ పరీక్ష జ‌రిపించిన పోలీసులు ఆ బాలుడే ఆ పాప‌కు తండ్రని తెలుసుకున్నారు. కేసు ద‌ర్యాప్తులో భాగంగా ప్ర‌శ్నించిన పోలీసుల‌కు ఆ బాలుడు తాను వద్దంటున్నా ఆ యువ‌తే తనతో సంబంధం పెట్టుకుందని చెప్పాడు. దీంతో పోలీసులు పలు సెక‌్షన్ల కింద ఆ యువతిపైనే కేసులు పెట్టి, న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో ముందుకు వెళ‌తామ‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: