పార్లమెంటు .. దేశం మొత్తం గౌరవం ఇచ్చే ప్రాంతం. కేంద్ర మంత్రులు ఇక్కడ లిఖిత పూర్వకంగా చేసే ఏ నిబంధన అయినా చట్టబద్ధం .. దాన్ని దేశం మొత్తం ఆచరించి గౌరవించి తీరాల్సిందే. అయితే పార్లమెంటు సాక్షిగా రెండు తెలుగు రాష్ట్రాలకీ అన్యాయం జరుగుతోందా అంటే అంతకంటే ఎక్కువే జరుగుతోంది .. అదే కామెడీ పార్లమెంటు సాక్షిగా మనల్ని కామెడీ చేసి పారేస్తున్నారు అని కొందరు ఆరోపిస్తున్నారు.


తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలు ఎప్పటి నుంచో అసంబ్లీ నియోజికవర్గాల పునర్విభజన గురించి ఎదురు చూస్తున్నారు దీని గురించి హోం శాఖ సహాయ మంత్రి గంగారాం లిఖిత పూర్వకంగా పెద్ద ప్రకటనే చేస్తూ దీనికి ఫైనల్ ఆన్సర్ ఇచ్చేసారు. ఏపీ పునర్విభన చట్టం ప్రకారం తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలంటే 170(3) అధి కరణకు సవరణలు చేయడం తప్ప మరో దారి లేదని ఇందుకోసం 2026 దాకా ఆగాల్సిందేనని చెప్పారు.


కానీ ఆయన ఆ ప్రకటన చేసిన రోజు సాయంత్రమే వెంకయ్య నాయుడుగారు రంగంలోకి దిగి అచ్చం ఆయన చెప్పినదానికి ఆపోజిట్ లో కహానీ చెబుతున్నారు. నియోజికవర్గాల పెంపు కి సంబంధించి కేంద్ర హోం శాఖ నాట్ ఒకటి తయారు చేస్తోంది అనీ త్వరలో అది బయటకి వస్తుంది అని పొంతన లేని స్టోరీ ఒకటి చెప్పారు.


బడ్జెట్ సమావేశాల్లో నే స్థానాల సంఖ్య కి సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ ని తీసుకొస్తాం అని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. కేంద్ర మంత్రి ఇచ్చిన అధికార లిఖిత సమాధానం వచ్చిన కొన్ని గంటల్లో ఇలా మాట్లాడుతున్నారు మిగితా పెద్ద మంత్రులు. తన సహాయమంత్రి కంటే భిన్నమైన నిర్ణయం హోం మంత్రి చెప్పడం తెలుగు రాష్ట్రాలు అంటే కేంద్రానికి ఎంత కామెడీ అయిపోయాయి అనేది చూపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు.,


మరింత సమాచారం తెలుసుకోండి: