అమరావతిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్..


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై సీఆర్డీఏ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో సహా స్పీకర్ కోడెల 
శివప్రసాద రావు, ఏపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరికి నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు దృశ్యరూపంలో సిటీ నిర్మాణాన్ని వివరిస్తున్నారు. మొత్తం అమరావతిని 9 భాగాలుగా విడదీసి అడ్మినిస్ట్రేటివ్ నగరం, మీడియా నగరం, పర్యాటక నగరం, న్యాయ నగరం... ఇలా మొత్తం 9 నగరాలు నిర్మిస్తున్నారు.


అమరావతిపై ఇంత హంగామా ఎందుకు?


అసెంబ్లీ కమిటీ హాల్లో పోస్టర్ డిజైన్ ప్రదర్శన ద్వారా అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు శాసనసభ్యులకు వివరించారు. దీనిపై బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఆ రాష్ట్రాలన్ని ఇలాగే హంగామా చేశాయా? అని ప్రభుత్వ తీరును సోము వీర్రాజు దుయ్యబట్టారు. ఇప్పుడున్నవి అసెంబ్లీ, సచివాలయాలు కాదా? మళ్లీ కొత్తవి నిర్మించడం అవసరమా? అని ప్రశ్నించారు. 


వైఎస్ జగన్ కచ్చితంగా సీఎం అవుతారు..


వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా సీఎం అవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ సీఎం కావాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ రాజకీయ వ్యభిచారులని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. అధికారం, మంత్రి పదవి, డబ్బుల కోసమే వారు వైఎస్ఆర్ సీపీని వీడి టీడీపీలో చేరారని అన్నారు.


అగ్రిగోల్డ్’ నుంచి జగన్‌కు ముడుపులు: మంత్రి


ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘అగ్రిగోల్డ్’ యజమానుల నుంచి గత ఎన్నికల సమయంలో జగన్ 
డబ్బులు తీసుకున్నారని పుల్లారావు ఆరోపించారు. శుక్రవారం ‘అగ్రిగోల్డ్’ భూములపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ భూములను ప్రత్తిపాటి కొనుగోలు 
చేశారని, ఇదో పెద్ద కుంభకోణమని జగన్ ఆరోపించారు.


కలెక్టర్ మురళి వ్యాఖ్యలపై మండిపడ్డ బ్రాహ్మణ సంఘాలు ...

‘‘మాంసం తింటే ఆరోగ్యంగా ఉంటాం. కానీ.. బ్రాహ్మణిజం మాత్రం పెద్దకూర తినొద్దంటూ దరిద్రపు కల్చర్‌ని నేర్పింది. ఆ దేవుడు.. ఈ దేవుడి పేరిట ఏవేవో పిచ్చి మాలలు 
వేసుకుని.. మాంసం తినడం మానేయొద్దు..’’ అని జయశంకర్‌ జిల్లా కలెక్టర్‌ ఆకునూరి మురళి అన్న మాటలు వివాదాస్పదమయ్యాయి. కులం పేరు ఎత్తడాన్ని ఖండిస్తూ బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. బీజేపీ, వీహెచ్‌పీ నేతలు ధర్నా చేశారు. దాంతో దిగివచ్చిన మురళి వారికి క్షమాపణ చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: