2024లో యోగినే ప్రధాని...



ఉత్తరప్రదేశ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ను 'భవిష్యత్తు ప్రధాని' అంటూ అప్పుడే ఆయన మద్దతుదారులు కీర్తించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ నియోజకవర్గంలో ఈ తరహా ప్రచారం భారీగానే జరుగుతోంది. సీఎంగా ఎన్నికైన తర్వాత తొలిసారి యోగి శనివారం నాడు గోరఖ్ పూర్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను చూసేందుకు వేలాదిగా కార్యకర్తలు ఆయన ఇంటివద్దకు తరలివస్తున్నారు.


రజనీకాంత్ రాజకీయాలకు వచ్చేది లేదు..


తమిళ రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చక్రం తిప్పుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉండటంతో.. సినీ లెజెండ్ కమల్ హాసన్ రాజకీయాల్లో వస్తారనుకున్నారు. అయితే కమల్ కూడా ఈ మధ్య సోషల్ మీడియా రాజకీయాలపై పెద్దగా స్పందించకుండా కామ్‌గా ఉండిపోవడంతో.. ఇక యంగ్ సూపర్ స్టార్.. తమిళనాడులో రజనీకాంత్‌కు తర్వాత గొప్ప ఫాలోయింగ్ ఉన్న హీరో ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.


మరో ఫ్రీ ఆఫర్‌తో ముందుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.


 ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) మరో ఉచిత ఆఫర్‌తో ముందుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ జీఎస్ఎం డేటా సర్వీసులు వినియోగించని వినియోగదారులకు 1 జీబీ డేటాను ఒకసారి ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొంది. డిజిటల్ ఇండియాను మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే ఈ ఆఫర్ ప్రకటించినట్టు తెలిపింది. మరిన్ని వివరాల కోసం వినియోగదారుల సేవా కేంద్రాన్ని కానీ, బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.


అమెరికన్ల ఉద్యోగాలు ఇకపై విదేశాలకు నో.. 


అమెరికన్ల ఉద్యోగాలను విదేశాలకు తరలించే కంపెనీలకు ఇకపై బ్రేక్ వేసే దిశగా కొత్త బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. హెచ్‌1బీ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తూ విదేశాలకు తరలిపోయే ఉద్యోగాలను ఈ బిల్లు ద్వారా కళ్లెం వేయవచ్చు. డెమొక్రాట్‌ సభ్యుడు డెరెక్‌ కిల్మర్‌, రిపబ్లికన్‌ సభ్యుడు డగ్‌ కొలిన్స్‌ ‘ద కీపింగ్‌ అమెరికన్‌ జాబ్స్‌ యాక్ట్‌’ పేరిట ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 


అల్లుడి తీరుపై ట్రంప్ అప్‌సెట్ అయ్యారట!


ఒబామా కేర్ వైద్య పాలసీపై చర్చ జరుగుతున్న కీలక సమయంలో కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్ కుష్నెర్ విహారయాత్రకు వెళ్లడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అప్‌సెట్ అయ్యారట. ట్రంప్‌కు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఈ విషయం చెప్పారు. ఒబామాకేర్‌ వైద్య పాలసీ స్థానంలో కొత్త పాలసీని ప్రవేశపెట్టేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే



మరింత సమాచారం తెలుసుకోండి: