ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పాలన లో సక్సెస్ అయ్యారా..? తన పాలన పై ప్రజలు సంతృప్తి చెందారా...? ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కేసీఆర్ నేరవేర్చారా..? వీటన్నింటిపై ప్రజల ఆలోచనలు తెలుసుకోకుండానే కేసీఆర్ 2019 ఎన్నికల్లో అధికారం మాదే అని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కేసీఆర్ ది కాన్ఫిడెన్సా..? ఓవర్ కాన్ఫిడెన్సా..? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు, ఒక సామాన్య మానవుడికి ఒరిగింది ఏమిటి..? సంక్షేమ పథకాలా..? అది ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. రైతన్నలకు రుణ మాఫీ అన్నారు.


Image result for kcr

అదీ జరగలేదు, డబుల్ బెడ్ రూ మ్ ఇళ్లు కొంతమందికి నిర్మిస్తే అది అందరికీ నిర్మించునట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా పేదవారికి ఇళ్లు కట్టించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఉద్యోగ నియామకాలకే దిక్కు లేదు. పదో పరకో ఉద్యోగాలు ఇస్తే అందరికీ వచ్చినట్టు కాదుగా..? ఒక నిరుపేద కుటుంబంలో, పేద గుడిసేలో నివసిస్తున్న ఒక కుటుంబానికి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పతకాలు అసలు తెలుసా..? తెలిసినా అవన్నీ అతనికి వర్తిస్తాయా..? అలా వర్తిస్తే ఇప్పటివరకు కొంత మందైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడే వారే కదా..! అలాంటి దాఖలాలు మనకు ఇప్పటివరకు కనిపించనే లేదు.


Image result for kcr

కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ పోగుడుకుంటూ.. మేమే వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపడతామని చెప్పడం విడ్డూరంగా ఉంది. మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, ఎంపీ లు ఒక్క సారి సామాన్యుడి వద్దకు వెళ్లండి. సామాన్యుడిని మీ పరిపాలనా తీరును ప్రశ్నించండి. మీ పరిపాలన పట్ల తను పూర్తిగా సంతృప్తిగా ఉంటే.. అప్పుడు మీరు నిజమైన ప్రజా నాయకుడు అన్నట్టు అర్థం. అంతే కానీ ఏసీ కార్లల్లో తిరుగుతూ.. పెద్ద పెద్ద విల్లాల్లో నివసిస్తూ, ప్రతి పుటా పంచభక్ష పరవన్నాలతో భోజనం చేస్తూ, నిర్ల్యక్షంగా పరిపాలన సాగిస్తూ.. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. జలగల్లా మీరక్తాన్ని తాగుతాం అంటే మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కుదరదు కేసీఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: