పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ‘కాటమరాయుడు’ చిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌తో సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకున్నారు.  ఈ సందర్భంగా 'కాటమరాయుడు'లో పవన్ కల్యాణ్ నటన బాగుందని కితాబునిచ్చారు. ఒక సినిమా ద్వారా ఖాదీ వస్త్రాలకు ప్రచారం కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. కాగా, ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే.



2019 ఎన్నికల్లోనూ తెలంగాణలో టీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు కూడా సీఎం కేసీఆర్‌ నాయకత్వం వహిస్తారని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో ముచ్చటించారు.సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, వాటిని మతపరమైన రిజర్వేషన్లుగా చూడొద్దని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఆ దిశగా లబ్ధిపొందే ప్రయత్నం ఎవరూ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.


Image result for ktr

ప్రాజెక్టులను అడ్డుకునేందుకు న్యాయస్థానాల్లో తప్పుడు కేసులు వేస్తున్నారని ఆరోపించారు. కేసులు వేస్తున్న విషయాన్ని  సభలోనే సీనియర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒప్పుకున్నారన్నారు. కోర్టు కేసులు, ఇతర అవాంతరాల కారణంగా ప్రాజెక్ట్‌ లు ఆలస్యం అవుతున్నాయన్నారు. అయినప్పటికీ వీలైనన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: