గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం తనకు అస్సలు ఇష్టం ఉండదని, నటించాలనే కోరిక తనలో ఎప్పుడూ లేదని చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే నటనపై తనకు ఇష్టం లేదంటూనే సినిమాలు తీయడానికి పవన్ మొగ్గుచూపుతున్నారంటే.. కారణం రాజకీయం. అవును నిజం పవన్ తన పార్టీకి నిధులు సేకరించడం కోసమే ఎలాంటి సినిమాలు తీస్తున్నాయని అటు రాజకీయ వర్గాలు, ఇటు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పవన్ తన జనసేన పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నవిషయం అందరికీ తెలిసిందే. అయితే పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అందుకు డబ్బు అత్యవసరం.


Image result for pavan janasena

అందుకే పవన్ కాటమరాయుడు చినిమా తీయాలని ముందే నిర్ణయించుకున్నట్టు ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది. ఎన్నికల డబ్బుకోసం తీసే సినిమా ఎలాగైనా సరే భారీ కలెక్షన్లను రాబట్టాలని ముంచే నిర్ణయించుకున్న పవన్ అందుకే కాటమరాయుడు సినిమా ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా పార్టీ ఫండ్ కలెక్షన్ సాధించాలని పవన్ ఆశించారట. పవన్ అనంతపూర్ సభలో మాట్లాడినప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను మీరు సరిగ్గా చూడలేదని అందుకే తనకు డబ్బులు రాలేదని పవన్ ఆ సమయంలో అన్నారు.


Image result for pavan janasena

కేవలండబ్బుల కోసమే పవన్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  30 కోట్ల రూపాయలతో సినిమా తీసిన పవన్ కల్యాణ్ వంద కోట్లకు అమ్ముకుని 70 కోట్ల రూపాయలు జేబులో వేసుకుని, కుమార్తెల పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నాడని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిన్న చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: