ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాని కి వచ్చి స్తిరపడ్డ రాష్ట్రకూటు లే రెడ్లు గా మారినారని శాసనాల ఆదారం గా తెలుసుకున్నాము.రెడ్డి పదోత్పత్తి 7 వ శతాబ్దం నుంచి రక రకాలు గా పేరు మార్చుకుంటు వస్తుంది.మొదట 7 వ శతాబ్దం లొ రట్టగుడి గా, తర్వాత రట్టొటి,రాథొడ్, రట్టాడి, రట్టజికము, రద్రికము,రడ్డి గా మారుతూ వచ్చి చివరకు రెడ్డి దగ్గర స్తిరపడింది.


క్రీ.శ.641 వ సంవత్సరము నకు సంబందించిన గుంటూరు జిల్లా మాచర్ల శాసనం లో రట్టగుళ్ళు గా పేర్కొనబడినది. 9 వ శతాబ్దము నకు సంబందించిన వరంగల్ జిల్లా లోని కొండపర్తి శాసనం లో పొలమెయరట్టోడి గా పేర్కొనబడినది.పొలమెయరట్టోడి అనేది గ్రామ పెద్ద లేదా అధికారి పేరు అయ్యి వుండొచ్చు.ఈ శాసనము భూమి కౌలు కు సంబందించిన ఒప్పందము గురించి తెలియ చేస్తుంది.  1065 వ సంవత్సరము ప్రాంతము లో రెడ్లు రడ్డిగా పిలవబడినట్లు మెదక్ జిల్లా లోని ములుగు గ్రామము వద్ద లబించిన కల్యాణి చాళుక్యు లకు సంబందించిన శాసనం తెలియజేయుచున్నది.ఈ శాసనము 1065 సంవత్సరమునకు సంబందించినది.ఈ శాసనము ప్రకారము కదిరడ్డి మినిరడ్డి ని గ్రామ పెద్ద గా నియమించినట్లు పేర్కొనబడినది.


దక్షిణాని కి వచ్చిన తర్వాత రాష్ట్రకూటులు చాలుక్యుల కాలం లొ గ్రామ పెద్దలు గా పనిచేసారు.ఆ తర్వాత కాకతీయుల కాలం లొ సైనిక అదికారులు గా మరియు సామంత రాజులు గా పని చేసారు.ఇనగాల బమ్మి రెడ్డి,రేచెర్ల నామి రెడ్డి,బేతి రెడ్డి మరియు రుద్రి రెడ్డి లు సైనిక అధికారులు గా పని చేసినట్లు శాసనాల ద్వార తెలుస్తుంది.రెడ్ల లొ అనేక శాఖలు ఉన్నవి.అందులొ మొటాటి, పాకనాటి,వెలనాటి,గుడాటి, పంట(దేసటి),పెడకంటి,కుంచేటి, రేనాటి,ఓరుగంటి,భూమంచి మొదలైనవి తెలుగు ప్రాంతాల్లొ వినిపిస్తుంటవి.ఇందులొ కొన్ని నివాస ప్రాంతాల పేర్లతో యేర్పడితె మరికొన్ని కట్టుబాట్లు మరియు నడవడిక తో యేర్పడినట్లు తెలుస్తుంది.


మొటాటి (మొట్టనాడు),పాకనాటి (పాకనాడు), వెలనాటి (వెలనాడు),
రేనాటి( రేనాడు) ప్రాంతాల ఆదారం గా ఎర్పడినట్లు తెలుస్తుంది.
పాకనాడు,రేనాడు మరియు వెలనాడు రెడ్లు:
పాకనాడు, వెలనాడు, రేనాడు అనేవి ఒకప్పుడు తెలుగు చోళులు పరిపాలించిన రాజ్యాల పేర్లు.గుంటూరు జిల్లాలోని నరసారావుపేట,గురజాల మరియు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతాలను కలిపి పల్నాడు సీమ అంటారు.గోదావరి, పెన్నా నదుల మద్య ఉన్న రేపల్లె మరియు తెనాలి ప్రాంతాలను కలిపి వెలనాడు అంటారు.నెల్లూరు చుట్టు ప్రక్కల ప్రాంతాలను పాకనాడు అంటారు.కడప ప్రాంతాన్ని రేనాడు చోలులు పాలించినారు అందుకే ఈ ప్రంతాన్ని రేనాడు గా పిలుస్తారు.


పాకనాడు,రేనాడు మరియు వెలనాడు తొ ప్రాంతాలు ఉండడం వలన పాకనాటి రెడ్లు , రేనాటి(రేనాడు) మరియు వెలనాటి రెడ్ల విషయంలో కొంత స్పష్టత వచ్చింది.అయితే తెలంగాణ ప్రాంతం తో పాటు  కర్నూలు,క్రిష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో ఎక్కువ గా ఉన్నటువంటి మొటవాడ (మొటాటి) రెడ్లు ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయంలో స్పష్టత లేదు.


మొటవాడ (మొటాటి) రెడ్లు:
కవి రెడ్రెడ్డి మల్లారెడ్డి (1650-1700) ప్రాంతం లొ రాసిన పద్యం లొ తాను మోటవాడ వంశానికి చెందిన వ్యక్తి గ చెప్పుకున్నాడు.అంతేకాకుండ తన తాత గ్రామ చౌధరి గా పనిచేసినట్లు పేర్కొన్నాడు.
"అట్టి గంగ కు తోబుట్టువగు చతుర్ధ 
జాతియందు నితాంత విఖ్యాతిదనరు
చున్న మొటవాడకులమున నొప్పు మీరే
చాల బిజ్జుల దాద భూపాలమౌలి"   --- తిమ్మ భూపాలుడు
సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం అలంపూర్ ను పాలించిన రెండవ తిమ్మ భూపాలుడు (తిమ్మ రెడ్డి) తాను మొట్టవాడ కు సంబందించిన వ్యక్తి గా పద్యాల్లొ రాసుకున్నాడు.దీన్ని బట్టి మొట్టవాడ నె మొటాటి అని,ఇది ఒక ప్రాంతానికి సంబందించిన పేరు అని తెలుస్తుంది.అయితె మొట్టవాడ అనే పేరు కు దగ్గరగా పోల్చిచూస్తె వరంగల్ పట్టణంలో మట్టెవాడ అని ఒక ప్రధానమైన వీది ఉన్నది.మొట్టవాడ రెడ్లు మట్టెవాడ ప్రాంతం నుంచి వచ్చి ఉంటారని స్వర్గీయ సురవరం ప్రతాప రెడ్డి గారు అబిప్రాయపడినారు.సురవరం ప్రతాప రెడ్డి గారు ఇంకా కొంతకాలం జీవించి ఉంటె మొటాటి శాఖ విషయం లో పూర్తి స్పష్టత వచ్చి ఉండెది.


అయితే మొటవాడ ను పోలిన మరో ప్రాంతం పేరు మొట్టవాడినాడు.ఒకప్పటి పల్నాడు సీమలో బాగంగా ఉన్న మార్కాపురం ప్రాంతాన్ని మొట్టవాడినాడు గ పిలిచేవారు.దీనిని బట్టి అలోచిస్తే మొటవాడ (మొటాటి) రెడ్లు పల్నాడు ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చు అనేదానికి కొంత బలం చేకూరుతుంది.అయితే పల్నాడు లో తరచుగా జరిగెడి యుద్దాలవలన మొటాటి రెడ్లు కొందరు తెలంగాణా ప్రాంతాలకు తరలివెల్లి వుండొచ్చు.


కొనిదెన (కాట్యదొన) 1150 సంవత్సరం శాసనం లో  త్రిభువనమల్లదేవ పొత్తపి చోడ మహరాజు కమ్మనాడు, గుండికర్రు మరియు మొట్టవాడి ప్రాంతాలను జయించినట్లు పేర్కొనబడినది.మొట్టవాడి-నాడు గురించి కల్యాణి చాలుక్యుల సంబందించిన త్రిపురాంతకం ఆలయ శాసనం లో చెప్పబడినది. త్రిపురాంతకం ఆలయ శాసనం ప్రకారం మొట్టవాడి-నాడు లో కవలకుంట,రాచగొండ,సతకోడు, ముత్తువాలు, కంభంపాడు,మ్రానెపల్లి, మేడపి,గుట్టలపల్లి, మిరియంపాడు మరియు దువ్వలి మొదలగు గ్రామాలు ఉండెవి.బాపట్ల శాషనంలో కూడా మొట్టవాడి గురించి ప్రస్తావించబడినది.బాపట్ల శాసనం ప్రకారం మొట్టవాడి-నాడు యొక్క త్రిపురాంతక ఆలయానికి పుల్లలచెరువు అనే గ్రామాన్ని ఇచ్చినట్లు వ్రాయబడినది.


కమ్మనాడు క్రింద ప్రెంపల్లి,మధుకంబల్లి, పల్లమెట్ట, ఉప్పుగుండురు, పెద్ద గంజాం, కదకుడురు, కురవద, పయుందొర్రు, చిన్న గంజాం,కణుపరితి, పులిచెరువు, కోత్యదొన, అక్కరజు చెరువు,బల్లికురువ, గుందియపుండి, జొన్నప్రాలురు, అమ్మలపుండి,ఎద్దనిపుండి, రామకురు,చెంజెర్వు, కొప్పరం,సోఘరేవు మొదలగు గ్రామాలు ఉన్నట్లు ఇతర అదారాలను బట్టి తెలిస్తుంది.


పంట (దేసటి) రెడ్లు:
12,13 వ శతాబ్దంలలో పంట రాజ్యము నెల్లూరు చోడుల పరిపాలనలో భాగం గా వుండెది.పంట రాజ్యము లో నివశించినవారె పంట రెడ్లు గా పిలవబడియుంటారని చరిత్రకారులు అబిప్రాయపడినారు.పంట రెడ్డి వంశస్తులు అద్దంకి ని రాజధాని గా చేసుకుని రెడ్డి రాజ్య స్తాపనకు పునాది వేశారు, తర్వాత కొండవీడు కు రాజధాని ని మార్చి పరిపాలనను కొనసాగించారు.ప్రొలయ వేమారెడ్డి,అన వోటారెడ్డి, అన వేమా రెడ్డి,కుమర గిరిరెడ్డి,కటయ వేమారెడ్డి,అల్లాడ రెడ్డి,వీర భద్రారెడ్డి మొదలగు వారు దాదాపు 123 సంవత్సరములు పరిపాలించారు.


కొండవీడు ను పాలించిన రాజులను దేసటి రెడ్లు అనికూడ పిలిచేవారు.దేసటి రెడ్డి(దేశ రట్టొడి నుంచి వచ్చింది) అంటె స్తానిక రెడ్లు అని అర్థం వచ్చును.దేసటి అనేది పంట రెడ్ల లొ ఒక రకం అయ్యికూడ ఉండొచ్చు లేదా ఇంటిపేరు ఐనా అయి వుండొచ్చు. పంట కులము లో పద్నాలుగు రకాలు వున్నట్లు గా 15 వ శతాబ్దపు అరవీడు వంశానికి చెందిన బుక్కరాయల కాలం నాటి భట్టు రాజు చెప్పిన పద్యం ద్వార తెలుస్తుంది.


"పంటాన్వయమునను పద్నాల్గుశాఖల
జక్కగా వివరింతు సత్యమరసి
మొటాటి వెల్నాటి మొరస నేరే డయోద్య
పంట పొంగలినాటి పాకనాటి
భూమంచి కురిచేటి మున్నూటి దేసటి
యొనర గండియకోట యోరుగంటి
యన ఒరగుచునుండు నంధ్రావనీస్థలి
గౌరవాదిష్ఠిత కాపు కులము
పంట పదునాల్గు కులములం చంట జగతి
దర తరంబుల నుండియు వరలెడినుడి
వీనికుపజాతు లున్నవి వివిధములుగ
భుజబలాటోప పిన్నమ బుక్క భూప"


భూమంచి రెడ్లు:
భూమంచి పదం బహుమంచి(చాలా మంచివారు) నుంచి ఏర్పడినట్లు కొందరి అబిప్రాయము.మంచి భూమి ని కలిగి ఉన్నవారు అని మరి కొందరి అబిప్రాయము. భూమంచి రెడ్లు ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి జిల్లాల్లొ ఎక్కువ గ ఉంటారు.


దేశ్ ముఖ్,దేసాయి మరియు చౌధరి :
దేశ్ ముఖ్,దేసాయి మరియు చౌధరి అనేవి రెడ్ల శాఖలు కావు.వివిద హోదాలల్లో పనిచేసిన రెడ్లు రాను రాను అవే తమ శాఖలు గా చెప్పుతున్నారు కాని అవి కేవలము రెడ్ల హోదా మరియు స్తోమతను బట్టి పిలవబడిన పేర్లు మాత్రమే.

దేశ్ ముఖ్, దేసాయి మరియు చౌధరి మొదలగునవి ఉత్తరాదినుంచి తెలుగు ప్రాంతానికి వచ్చినవి.దేశ్ ముఖ్ మరాఠ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తది.దేశ్ ముఖ్ అనే టైటిలు తో కొన్ని గ్రామాల భూముల పైన లేదా కొంత భూబాగం పైన హక్కులు కలిగి ఉన్నవాల్ల ను పిలిచేవాల్లు.దేసాయి దేస అనే సంస్క్రుత పదం నుంచి వచ్చింది. దేస అంటె భూమి(ల్యాండ్).పాలనా పరం గా ల్యాండ్ లార్డ్స్ (జమిందారులు) ను దేసాయి గా పిలిచేవాల్లు.రెడ్రెడ్డి మల్లారెడ్డి పద్యాల లొ చెప్పినదానిని బట్టి చౌధరి అనేది కేవలం ఒక హోదా నే అని అర్థం అవుతుంది.కొంత మంది చౌధరి రెడ్డి శాఖ అని చెప్పుతుంటారు, కాని చౌధరి రెడ్డి అంటే శిస్తు వసూలు చేసే గ్రామ పెద్ద అని మల్లారెడ్డి పద్యాల ద్వార తెలుస్తుంది.


తెలంగాణా లొ దొరలు మరియు పటేండ్లు :
దొర మరియు పటేలు అనే పదాలు నిజాం రాజుల పాలన మొదలైనప్పటి నుంచి అంటే 1724 తర్వాత తెలుగు ప్రాంతాల్లో వాడకంలోకి వచ్చినవి.దొర మరియు పటేలు అంటె కులం కాదు కేవలం ఒక హోదా మాత్రమె.ఒకే కుటుంబం కు చెందిన రెడ్డి వంశీయులు వివిద గ్రామాలకు వలసబోయి కొందరు దొర గా పిలవబడితె మరికొందరు పటేండ్లు గా పిలవబడినారు.అలాగె ఒకే కుటుంబానికి చెందిన కొందరు వెలమ వంశీయులు వలస కారణం గా  విడిపోయి కొందరు పటేండ్లు గా మరికొందరు దొరలు గా పిలవబడినారు.ఇంకా చరిత్ర తవ్వితె మెదక్ జిల్లా లోని గట్ల మల్యాల గ్రామం లో విశ్వబ్రాహ్మణ వంశానికి చెందిన వారిని,కరీంనగర్ జిల్లా లోని కథలపూర్ గ్రామం లో వైశ్యుల వంశానికి సంబందించిన వారిని మరియు వరంగల్ జిల్లా ములుగు మండలం లోని మదనపల్లి గ్రామం లో లంబాడి కుటుంబం వారిని కూడా దొర లు గా పిలిచారు.అయితే గ్రామాల్లొ నిర్వహించిన పనిని బట్టి దొర లేదా పటేలు  గా పిలవబడినారు అంతే కాని వీటికి అంత గా ప్రాముఖ్యత లేదు.


రెడ్ల ఇంటి పేర్లు మరియు గోత్రాలు :
రెడ్ల లొ మొత్తం పదివేల ఇంటిపేర్లు వున్నట్లు చరిత్ర కారులు చెప్పుతారు. మొటాటి లొ 360 గోత్రాలు వున్నట్లు మరియు పాకనాటి లొ 120 గోత్రాలు వున్నట్లు రెడ్ల వద్దకు వచ్చె పిచ్చుకుంట్ల వాల్లు చెప్పుతుంటారు.వీరు కుంటి మల్లా రెడ్డి మరియు అనుముల బ్రహ్మ రెడ్డి కథ చెప్పుకుంటు కొన్ని గోత్రాల పేర్లు చదువుతుంటారు.
రెడ్లలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాల్లు:


గోన బుద్దా రెడ్డి : 
గోన బుద్దా రెడ్డి 13 వ శతాబ్దానికి సంబందించిన వారు. కాకతీయ రుద్రదేవుడు కందూరు చోళులను జయించి ఆ స్థానం లో గోన బుద్దా రెడ్డి ని సామంత రాజు గా నియమించాడు.గోన కుటుంబం మహబూబ్ నగర్ లోని బిజినేపల్లి మండలం, వర్థమానపురం (నేటి వద్దెమాని) మరియు బుద్దపురం(నేటి బూత్పూర్) కేంద్రాలు గా పరిపాలన కొనసాగించారు.గోన బుద్దా రెడ్డి రంగనాథ రామాయణం రాసి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.


వేమన : వేమన కొండవీడు రెడ్డి రాజుల కుటుంబం లో జన్మించారు.వేమన 1652 వ సంవత్సరములో జన్మించి వుండవవచ్చని తెలుగు బాష మీద పరిశోదన చేసిన సి.పి.బ్రౌన్ పేర్కొన్నారు.ఎంతో సాదారణ జీవితం గడపిన వేమన నీతిసారము తో పద్యాలు రాసి తెలుగు గడ్డ పై చెరగని ముద్ర వేసారు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి: ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి భారతదేశంలోనె మొదటి స్వాతంత్ర సమరయోదులు.సిపాయీల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అమరుడు అయినారు.


రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి: రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి చిన్న తనంలోనే తల్లిని,తండ్రిని కోల్పోయి మేనమామ వద్ద పెరిగారు.అరవై రూపాయల వేతనంతో  అమీను కొలువులో చేరి అంచెలంచెలుగా ఎదిగి హైదెరాబాద్ కొత్వాలు పదవి చేపట్టి 7 వ నిజాం రాజు దగ్గర ఎంతో పేరు గండించారు.ఎన్నో విద్యాలయాలకు డబ్బు దానం చెసినారు.గ్రామీణ ప్రాంతాము వాల్లు చదువుకోవడానికి హైదెరాబాద్ లో హాస్టల్లు కట్టించి విద్యా వ్యాప్తికి ఎంతో దోహదం చేసినారు.


--కె.నేతాజి రెడ్డి


మరింత సమాచారం తెలుసుకోండి: