ప్రపంచ దేశాల్లో చిన్న దేశమే అయిన అత్యంత ఆధునికమైన టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న జపాన్ మరో అద్భుతమైన ప్రయోగం చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.  ముఖ్యంగా జపాన్ దేశస్తులు రోబోల తయారీలో ముందంజలో ఉన్నారు. తాజాగా జపాన్‌ శాస్త్రవేత్తలు  ఓ నాలుగు కాళ్ల రోబోను తయారుచేశారు.  దీని ప్రత్యేకత ఏంటంటే..వేగాన్నిబట్టి దానంతట అదే నడిచే పద్ధతిని మార్చుకోవడం..అవసరమైతే రెండు కాళ్లపై కూడా నడవటం చేస్తుంది.  Image result for japan sintests inagurated new robo
ఇప్పటికే ఎన్నో రకాల రోబోలను కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు ఈ రోబోలో చాలా ఫీచర్స్ ఏర్పాటు చేశారు.  ముఖ్యంగా ఈ రోబోను ఏదైనా విపత్తు సంభవించినపుడు..సహాయక చర్యల కోసం ఉపయోగిస్తారట.
Image result for japan sintests inagurated new robo
అయితే ఈ రోబో కేవలం నడవడం, పరిగెత్తడమే కాకుండా కొండలు, గుట్టలు, గోడలు, కంచెల వంటివాటిని సులభంగా ఎక్కేస్తుందని..అందువల్ల ఎలాంటి ప్రమాదంలో దేనినైనా రక్షించగల సామర్థ్యం ఉందని తయారీదారులైన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: