సాక్షి మీడియా వైఎస్ జగన్ సొంత మీడియా అన్న సంగతి తెలిసిందే. సాక్షి టీవీలో ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ వచ్చింది. ప్రముఖ జర్నలిస్టు, ప్రస్తుతం సాక్షిలో పని చేస్తున్న 
కొమ్మినేని శ్రీనివాసరావు ఈ ఇంటర్వ్యూ చేశారు. జగన్ అక్రమాస్తుల విషయంలో  సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రమాకాంత్ రెడ్డిని 
ఇంటర్వ్యూ చేశారు. 



ఈ ఇంటర్వ్యూలో సీబీఐ జగన్ పై పెట్టిన కేసులు నిలబడవనీ... సీబీఐ అధికారులకు ప్రభుత్వ నిబంధనలపై అవగాహన లేదని.. రమాకాంత రెడ్డి చెప్పుకొచ్చారు. దీన్ని సాక్షి టీవీ, సాక్షి పత్రిక ప్రముఖంగా ప్రచురించాయి. మొత్తానికి జగన్ ఆస్తుల విషయంలో సీబీఐ అత్యుత్సాహం ప్రదర్శించిందని... అసలు ఆ కేసుల్లో నిలబడేవి ఏమీ లేవనే ఇంప్రెషన్ ఈ ఇంటర్వ్యూల ద్వారా కలిగింది. 


ఇది నిజంగా జగన్ కు పొలిటికల్ మైలేజ్ ఇంచ్చే అంశమే.. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జగన్ కొంపముంచే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు జగన్ బయట తిరుగుతున్నా.. ఆయన కండిషనబుల్ బెయిల్ పై ఉన్న సంగతి మరచిపోకూడదు. బెయిల్ పై ఉన్నా కేసును ప్రభావితం చేసే ఎలాంటి చర్యా తీసుకోకూడదన్న నిబంధన ఉంటుంది. 




ఇప్పుడు ఈ పాయింట్ ను సీబీఐ ఉపయోగించుకుంటోంది. జగన్ తన సొంత ఛానల్ ను అడ్డుపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నాడని సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు 
చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరింది. జగన్ తన సొంత మీడియాను అడ్డుపెట్టుకుని సీబీఐ పై దుష్ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదు చేస్తున్నారు. సీబీఐ పిటీషన్ ను విచారణ కు స్వీకరించిన కోర్టు జగన్ కు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 7 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: