నితీశ్‌ ఆహ్వానం.. బీజేపీలో చీలిక!


బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ తాజాగా ఇచ్చిన అధికారిక విందు.. బీజేపీలో పెద్ద చీలికనే తెచ్చింది.  ఈ విందుకు కొందరు సీనియర్‌ నేతలు కొందరు హాజరుకాగా.. మరికొందరు డుమ్మా కొట్టారు. బీజేపీతో రెండు దశాబ్దాలకుపైగా ఉన్న అనుబంధాన్ని నితీశ్‌ తెగదెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ నేతలు ఆయన ఇచ్చిన విందుకు హాజరుకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బిహార్‌ బీజేపీ ముఖ్యనేత అయిన సుశీల్‌కుమార్‌ మోదీతోపాటు పలువురు ఈ విందులో దర్శనమిచ్చారు.

జయలలిత అంటే నాకు చాలా ఇష్టం.. 


దివంగత సీఎం జయలలిత అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు.. ఆమెపై ఉన్న ఆసక్తిని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన జస్టిస్ మార్కండేయ కట్జూ.. ఆమె మరణానికి అనంతరం తన మనసులోని మాటను ఎలాంటి జంకుబొంకు లేకుండా చెప్పేశారు. తాజాగా జయలలిత పక్కన తాను కూర్చున్న ఫోటోను ఫేస్‌బుక్‌లో పెట్టి.. ఇద్దరు పులులంటూ కామెంట్‌ చేశారు కట్జూ. 

స్ట్రిప్‌టీజ్ పార్టీ గుట్టు రట్టు చేసిన పోలీసులు..

విలాసవంతమైన భవనంలో గుట్టుగా సాగుతున్న స్ట్రిప్‌టీజ్ పార్టీ ని నాసిక్ పోలీసులు రట్టు చేశారు. లగత్‌పురి ప్రాంతంలోని ఓ విలాసవంతమైన మిస్టిక్ విల్లాలో పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు భవనంపై దాడి చేసి 13 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ అధికారుల కుటుంబాలకు చెందినవారు కావడం గమనార్హం. 

టెలినార్ నుంచి జియోను మించిన ఆఫర్!


మార్కెట్‌లోకి జియో ప్రవేశించడంతో ఇతర టెలికమ్ కంపెనీల కష్టాలు మొదలయ్యాయి. ఎయిర్‌టెల్, ఐడియా లాంటి సంస్థలు తమ వినియోగదారులను చేజారిపోకుండా చూసుకోడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఓ పక్క ఐడియా, మరోవైపు ఎయిర్‌టెల్ పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తుంటే తాజా టెలినార్ కూడా వీటి సరసన చేరింది. ఈ కంపెనీలు ఆన్‌లిమిటెడ్ ఆఫర్లు ప్రకటిస్తూ తమ మార్కెట్‌‌ను కాపాడుకోడానికి నానా తంటాలు పడుతున్నాయి.

అనిల్ అంబానీకి అంతర్జాతీయ గౌరవం

రిలయన్స్ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ.. ప్రపంచ మేధో సంపత్తి వర్గమైన ‘ది అట్లాంటిక్‌ కౌన్సిల్‌’లో సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు. ‘భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీని అంతర్జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా చేరుస్తూ ది అట్లాంటిక్‌ కౌన్సిల్‌ ప్రకటన చేసింది’ అని రిలయన్స్‌ గ్రూప్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై అనిల్ అంబానీ స్పందిస్తూ.. ‘మండలిలో ఇప్పటివరకూ అమెరికా ప్రాధాన్యం కొనసాగేది. కానీ, ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌.. భౌగోళికంగా, రాజకీయంగా ప్రభావవంతమైన దేశంగా గుర్తింపు పొందుతోంది. మండలిలో భారత్‌ గుర్తింపునకు ఇదే నిదర్శనం’ అని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: