కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లి బెయిల్ పై మళ్లీ బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో జగన్మోహ‌న్ రెడ్డికి ఈ రోజు భారీ షాక్ త‌గిలింది. అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌ బెయిల్ ను రద్దు చేయాల‌ని సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రతిపక్షనేతగా ఉన్న జగన్..


Image result for jagan

సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ పిటిషన్‌లో వివరించింది. కేసులో సాక్షులుగా ఉన్న వారితో మాట్లాడుతున్నార‌ని, వారిని ప్ర‌లోభపెడుతున్నార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. సీబీఐ పిటిష‌న్‌పై విచార‌ణ వ‌చ్చేనెల 7కి వాయిదా ప‌డింది. అప్పటిలోగా ఈ అభియోగాలపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ ను కోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి పరిపాల కొనసాగిస్తుండగా..


Image result for jagan

అనుకోకుండా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందడం జరిగింది. అయితే అప్పుడు జగన్ సీఎం పదవి కోసం పట్టుబట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుకు కాంగ్రెస్ పార్టీ ససేమిరా అనడంతో, కన్నా తల్లి లాంటి పార్టీతోనే కయ్యానికి కాలు దువ్వాడు జగన్. కొత్త పార్టీ స్థాపించి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మొదలు పెట్టాడు. అయితే ఎలాగైనా సరే జగన్ దూకుడిని తగ్గించాలని భావించిన కాంగ్రెస్ పార్టీ జగన్ ను అక్రమాస్తుల కేసులో కటకటాల వెనకకు పంపించింది. అదే కేసు జగన్ ను ఇప్పటికీ నీడలా వెంటాడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: