తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నానీ ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ అక్రమ దందాకు పాల్పడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుల్లో మెకానికల్ డిఫెక్ట్ ఉందని... ఈ మేరకు నివేదిక ఇవ్వాలని రవాణా శాఖపై కేశినేని ఒత్తిడి తెచ్చాడని.. అందుకు అనుగుణంగా నివేదిక రాకపోవడంతో రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంపై తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఆయనపై చేయి చేసుకున్నారని,


Image result for chandrababu

దీనికి తెలుగు దేశం పార్టీ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే అని ప్రతిపక్ష వైకాపా డిమాండ్ చేయడంతో, టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్క సారిగా సొంత పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. మీరు రౌడీలా..? లేక ప్రజాప్రతినిథులా..? జగన్ కు మీకు ఉన్న తేడా ఏటి..? అని బాబు ఆగ్రహంతో ఊగిపోయారు. కేశినేని నాని, బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరాను తన కార్యాలయానికి పిలిపించుకుని క్లాస్‌ తీసుకున్నారు. తక్షణమే ఆర్టీఏ కమిషనర్‌, సిబ్బందికి క్షమాపణ చెప్పాలని సూచించారు. 


Image result for chandrababu

ఏకంగా బాబే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతో టీడీపీ నేతలు నేరుగా రవాణ శాఖ కార్యాలయానికి వెళ్లి క్షమాపణలు చెప్పడమే కాక, మనసు నొచ్చుకొని ఉంటే మన్నించమని కోరారు. సీఎం సూచన మేరకు రవాణా శాఖ కమీషనర్ కి విచారణ వ్యక్తం చేశామని, తమకు పార్టీ పరంగా ఎలాంటి పక్షపాతాలు లేవని, అధికార పార్టీ నేతలు ప్రభుత్వ ఉద్యోగులపై దాడితో వారికే చెడ్డ పేరు వస్తుందని ఆర్టీయే కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: