బాలయ్య వెండి తెర ప్రస్తానం సాఫీగా కొనసాగుతుండడంతో షూటింగ్ లో చాలా బిజీ అయిపోయాడు. ఇలా షూటింగ్ బిజీలో బాలయ్యని భారీ మెజారిటీ తో గెలిపించిన హిందూపురం నియోజకవర్గం ప్రజలకు బాలయ్య అందుబాటులో లేడట. బాలయ్య నిరంతరం షూటింగ్ పై శ్రద్ధ పెట్టడంతో నియోజక వర్గంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. అక్కడ బాలయ్య నియమించిన ఇంచార్జులు కాసులతో కడుపు నింపుకోవడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడరు.


Image result for balakrishna hindupur

ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి ఒక ఎమ్మెల్యే ని ఎన్నుకునేది ఎందుకో తెలుసా..? ఎల్లప్పుడు ప్రజల వద్దే ఉంటూ, ప్రజా సమస్యలను తమ సమస్యలుగా భావించి సమస్యా పరిష్కారానికి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో వారధిలా పనిచేస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడనే ఉద్దేశంతోనే ఎన్నుకుంటారు.  హిందూపురం పట్టణంలో తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. లేపాక్షి మండల కేంద్రంలో నంది ఉత్సవాల సందర్భంగా మొదలుపెట్టిన రోడ్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు.


Image result for balakrishna hindupur

ఎన్నికల సమయంలో బాలయ్య ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా బాలయ్య నియోజక వర్గంలో బాలయ్య నియమించిన ఇంచార్జులకు, ప్రభుత్వ అధికారులకు మధ్య సఖ్యత లోపించింది. వీరిద్దరి సమన్వయ లోపమే బాలయ్య కు పెద్ద చిక్కుల్ని తెచ్చిపెట్టాయి. ఏది ఏమైనా ఇప్పటికైనా హిందూపురం ప్రజలు బాలయ్య తమ నియోజక వర్గాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: