జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన పిటీషన్ పై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చ సాగుతోంది. అసలు ఇప్పుడు సీబీఐకి హఠాత్తుగా రమాకాంత రెడ్డి ఇంటర్వ్యూ ఎందుకు గుర్తుకొచ్చింది... ఆ ఇంటర్వ్యూ మీడియా వచ్చి చాలా రోజులైంది.. ఐనా.. ఓ ఇంటర్వ్యూ ప్రసారం చేయడం అంత పెద్ద తప్పా.. అసలు ఇందులో లా పాయింట్ ఏంటి.. ఓ సారి పరిశీలిద్దాం.



సాధారణంగా ఏ రాజకీయ నాయకుడి ఇంటర్వ్యూనో అయితే ఇందులో పెద్దగా తప్పుబట్టాల్సింది ఏమీ ఉండదు.. అందులో జగన్ కు అనుకూలంగా ఎంత మాట్లాడించినా ఇబ్బంది ఉండేది కాదు.. కానీ.. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన రమాకాంతరెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులో సాక్షిగా ఉన్నాడు.. అంతే కాదు.. ఆయన గతంలో సీబీఐకి వాంగ్మూలం కూడా ఇచ్చాడు..


ఏమని ఇచ్చాడు.. జగన్ అక్రమాస్తుల కేసులో అంతా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన విషయం నిజమే అని వాంగ్మూలం ఇచ్చాడట రమాకాంతరెడ్డి.  పాపం ఆ విషయం రమాకాంతరెడ్డి మర్చిపోయాడో ఏమో.. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం అసలు జగన్ పై పెట్టిన కేసుల్లో పసే లేదు అన్నట్టు గంభీరంగా చెప్పేశాడు. దీంతో పాపం జగన్ అమాయకుడు.. అతన్ని సీబీఐ వేధిస్తోంది అన్నట్టు సీన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. 



ఇప్పుడు.. ఆ పాత వాంగ్మూలాలు.. ఈ కొత్త ఇంటర్వ్యూ వీడియో అన్నీ జతకలిపి.. సీబీఐ ఫిర్యాదు చేసింది. రమాకాంతరెడ్డి ఇలా మాట మార్చడం వెనుక జగన్ ఒత్తిడి ఉందని.. ఎందుకంటే అది జగన్ సొంత మీడియా కాబట్టి అని సీబీఐ వాదిస్తోంది. సో.. ఈ వాదనలో బలం ఉంది. 


ఐతే.. జగన్ యాజమాన్యంలో ఉన్నంత మాత్రాన అన్ని వార్తల్లోనూ జగన్ హస్తం ఉందని ఎలా చెబుతాం అని జగన్ లాయర్లు వాదించవచ్చు. మరి సీబీఐ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో.. జగన్ ఫ్యూచర్ ఎలా ఉందో.. కొన్నిరోజులు ఆగితే తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: