తెలుగు ఇండస్ట్రీలో 80వ దశకంలో  తన అందాలతో అందరి హృదయాలను కొల్లగొట్టిన నటి కవిత.  సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కవిత తల్లి, అత్త పాత్రలు వేస్తున్నారు.  అయితే సినిమా లో నటిస్తూనే తెలుగు దేశంలో పార్టీలో కొనసాగుతున్నారు కవిత. తాజాగా నవ్యాంధ్రప్రదేశ్‌ చలన చిత్ర వాణిజ్య మండలి(ఫిలించాంబర్‌) అధ్యక్షుడు ఎస్‌వీఎన్‌.రావుపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ  కవిత మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Image result for tdp leader kavitha
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పరిచయాలను వాడుకుని తనపై ఒత్తిడి చేస్తున్నారంటూ సినీ నటి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవిత నేరుగా పోలీసు స్టేషన్ తలుపు తట్టడం సంచలనం కలిగిస్తోంది. కవిత చెబుతున్న దాన్ని బట్టి, టాలీవుడ్‌లోప్రొడక్షన్ మేనేజరుగా పనిచేసిన ఎస్‌వీఎస్ రావు రాష్ట్ర విభజనం అనంతరం తన అధ్యక్షతన నవ్యాంధ్ర ప్రదేశ్ ఫిలిం చాంబర్ కార్యాలయం చెరిచాడు. పలువురు నిర్మాతలు, దర్శకులు, ఔత్సాహికులను సభ్యులుగా చేర్చుకుని సంస్థ పేరిట డబ్బులు వసూలు చేశాడు.  
http://img.sakshi.net/images/cms/2017-03/41490745420_Unknown.jpg
తనకు తెలియకుండానే ఆ సంస్థకు వైస్‌ ప్రెసిడెంట్‌గా  నియమించాడని, అయితే ఈ సంస్థకు ఎలాంటి హక్కులు లేవని తెలుసుకొని రాజీనామా చేసినట్లు కవిత చెప్పారు. అయితే తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని తనపై వొత్తిడి తెస్తున్నారని పైగా గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో తనపై లేనిపోని వదంతులు పుట్టిస్తున్నారని తన పరువు మొత్తం తీస్తున్నారనిఆమె ఆరోపిస్తున్నారు.  
Image result for tdp leader kavitha
తను స్థాపించిన సంస్థకు సీఎం చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయని నమ్మిస్తూ ఎస్‌వీఎస్ రావుడబ్బులు వసూలు చేశారని కవిత ఆరోపించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న రావుపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: