(హేవళంబిలో ఈనాడు తెలంగాణా ప్రజలకు మేలుకొలుపు)


ghmc building కోసం చిత్ర ఫలితం


హైదరాబాద్ నగరములో కార్యాలయ భవనం గాని, నివాస భవనంగాని, వాణిజ్య భవనం గాని చివరికి  చిన్న టిక్కిగాని కట్టి చూడండి? తెలుస్తుందప్పుడు మీ కార్పోరేటర్ నిజస్వరూపం. మీ కార్పోరేటర్ మహిళతే “ఆమె మొగుడు ఆమెకే కాక మీకూ మొగుడు అయిపోయి మీనెత్తిన కూర్చుంటాడు. మనం ఇక రానున్న ఎన్నికల్లో మహిళలను గెలిపిస్తే మనకిద్దరు ఎన్నికౌతారు. ఒక కార్పోరేటర్ను ఎన్నుకుంటే ఆమెతో పాటు ఆమె భర్త, ఆమె మరియు ఆమె భర్త అనుచరులు, జి హెచ్ ఎం సి ఉద్యోగులు, వారి అవుట్ సోర్సుడ్ ఉద్యోగులు ఆపై వారి తాలూకు రౌడీలు, గుండాలను కూడా ఎన్నుకున్నట్లే. వారు ఒకరు ఆమె. రెండవవారు ఆమె భర్త. బి వేర్ ఆఫ్ దిస్ ప్రోబ్లం.


సంబంధిత చిత్రం


వీరి వ్యవహారం తీరు చూస్తే పచ్చి గుండాల్లా వ్యవహరించటం కనిపిస్తుంది. అయితే వీరందరి వెనుక “అక్రమ హైరార్కి” ఉండి “మంత్రులు టాప్” లో ఉండి ఈ అక్రమ వ్యవస్థలను  నిర్వహిస్తున్నారని అంటున్నారు ప్రజలు. ఏదైనా ఎవరైనా ఘట్టిగా మాట్లాడితే “జి హెచ్ ఎం సి”  ఉండనే ఉంది. అది రాష్ట్రంలోనే అత్యంత పెద్ద అవినీతి కూపం. అధికారులు కావలసినంత తతంగం చేస్తారు, వారు అవినీతి యజ్ఞానికి పౌరోహిత్యం చేస్తారు. అలసత్వానికి నిర్లక్ష్యానికి మారుపేరైన ఈ మునిసిపల్ వ్యవస్థ ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. పనులు చేయటంలో మట్టితిన్న పాము అవినీతిలో చిరుతపులి కున్నంత వేగం “జి హెచ్ ఎం సి”  స్వంతం.



సామాజిక భాధ్యత ఏమాత్రమూ లేని ఈ కార్పోరేటర్లు, అధికారులు కుమ్మక్కై ప్రజలను కుమ్మేస్తున్నారు. ఒక్కరికి కూడా సామాజిక భాధ్యత లేదు అంటే మేం ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాం. అవి రాబట్టుకోవాలి అలాగే రోజువారీ అనుచరుల పోషణ ఖర్చు భరించలేకుండా ఉందంటారు.  ఎన్నికలలో అవినీతి చేసి గెలిచిన వీళ్ళనుండి తప్పించు కోలేని పరిస్థితి. ఒక్కో కార్పోరేటర్ తన ప్రణాళికా కాలంలో పదుల నుండి వందల కోట్లవరకు సంపాదించి ప్రజల నెత్తిన టొపీ పెట్టటంలో విజయ వంతమయ్యారు.


ghmc building కోసం చిత్ర ఫలితం


వీరికి తోడు అధికారుల అవినీతిదాహం కూడా తక్కువేమీకాదు. ఈ కార్పోరేటర్ అనుచరులలో "జి హెచ్ ఎం సి" కెరింది స్థాయి ఉద్యోగులేకాదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా రెగులర్ ఉద్యోగుల్లా ప్రజలపై పెత్తనం చలాయిస్తూ ఉంటారు. తెలంగాణా ఏర్పడ్డాక ఈ కొత్త రాష్ట్ర ఉద్యోగులందరికి జీతాలు విపరీతంగా పెరిగినా కూడా అవినీతి కూడా అదేస్థాయిలో పెరిగింది. సాధారణ ప్రజలు నలిగిపోవటం సర్వసాధారణ విషయం.


క్రింది నుండీ పైస్థాయి వరకు దోపిడీ పెరగటంతో, అసలే డిమోనెటైజేషన్ దెబ్బకి కుదేలైన నిర్మాణరంగం వీరి సమ్మెట పోట్లకు మరింతగా నలిగిపోతుంది. ఎవరైనా ముఖ్యమంత్రి కేటీఆర్ దగ్గరికి తీసుకెళదామన్నా వారేమీ నీతిమంతులా వారూ అంతే అని ఈ మహిళా కార్పోరేటర్ల భర్తలు నిర్భయంగా అంటున్న సంధర్భాలున్నాయని నిర్మాణరంగంలో ఉన్నవారు చెపుతున్నారు.


ghmc building కోసం చిత్ర ఫలితం


దీనిపై ఈనాడు నాకెందుకని ఊర్కోలేదు. సీరియస్ గానే స్పందించింది. తెలంగాణా ప్రభుత్వం విషయములో ఇంతవరకు మౌనం పాటించిన ఈనాడు స్పందన హర్షనీయం. ప్రభుత్వాల నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేయాలంటే ఈనాడు సహకారం అవసరం. ఉభయ తెలుగు ప్రజలు ఈనాడు మార్గ దర్శకత్వానికి ముగ్ధులౌతారు. రాష్ట్రాల్లో అనేక విప్లవాలకు ఉద్యమాలకు ఈనాడు స్పందించిన తరవాతే అవి విజయవంతమయ్యాయి.

ఈనాడు న్యూస్ ఐటం "కార్పోరేటర్ల కుమ్ముడు" (కార్పోరేటర్ల కాసులవేట) రూపములో స్పందన ప్రజలకు గుండె ధైర్యం.  తెలంగాణాలో కార్పోరేటర్ల అవినీతిపై స్పందించినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అవినీతి పరులపై ఈనాడు స్పందన కోరుకుంటున్నారు ఆంధ్రులు కూడా! 

మరింత సమాచారం తెలుసుకోండి: