చేతిలో పదవి ఉంది కదా అని తమ ప్రతాపాన్ని ఎవరిపై పడితే వారిపై చూపిస్తే..కొన్ని సార్లు బెడిసి కొడుతుంది. ఇదే ఇప్పుడు ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పట్ల జరుగుతుంది.   ఈ మద్య విధుల్లో ఉన్న ఎయిర్ ఇండియా మేనేజర్‌పై చేయి చేసుకోవడమే కాకుండా, క్షమాపణ చెప్పడానికి అంగీకరించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై అన్ని దేశీ విమాన సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.   ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన కారులో ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఉదయం కారులో ఢిల్లీకి బయలుదేరిన గైక్వాడ్ లోక్‌సభ సమావేశానికి హాజరుకావడం లేదు.  
air india air hostesses
ఎయిరిండియా మేనేజర్ సుకుమార్ (60)ని 25 సార్లు చెప్పుతో కొట్టడంతో పాటు మెట్ల మీద నుంచి కిందకు తోసేయడంతో ఎయిరిండియా వర్గాలు గైక్వాడ్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఒక ప్రయాణికుడిని ఎక్కించుకోవాలా వద్దా అనే విషయంలో ఎయిరిండియాదే పూర్తి నిర్ణయాధికారమని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పార్లమెంటులో చెప్పారు.  తాజాగా ఎయిరిండియా విమానంలో వెళ్లాలని ఎంతలా ప్రయత్నించినా శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పాచికలు పారలేదు. చివరకు ఆయన రైల్లోనే వెళ్లాల్సి వచ్చింది.
Flying ban on Shiv Sena MP Ravindra Gaikwad: Top developments
ముంబై నుంచి బుక్‌ చేసుకున్న టికెట్‌తో పాటు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుక్ చేసుకున్న విమానం టికెట్‌ను కూడా ఎయిరిండియా రద్దు చేసేసింది. దాంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ఢిల్లీ వెళ్లారు. కనీస మర్యాద లేకుండా విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకుని, క్షమాపణ కూడా చెప్పని ఎంపీని ఉపేక్షించేది లేదని విమానయాన సంస్థలు భీష్మించి కూర్చున్నాయి. దీంతో చేసేదేమి లేక రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు మన ఎంపీ  రవీంద్ర గైక్వాడ్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: