Related image


మన రెండు తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలు రెండు ముఖ్యమైన భారీ బడ్జెట్ సినిమాల విషయం లో దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకొని హైకోర్ట్ ఆగ్రహానికి గురయ్యాయి. అందులో ఒకటి గుణశేఖర్ దర్శకత్వములో అనుష్కాషెట్టి లీడ్ రోల్లో నటించిన తెలుగువారి కాకతీయుల చరిత్రాత్మక చిత్రం "రుద్రమదేవి" అయితే మరొకటి క్రిష్ దర్శకత్వములో నందమూరి నటసింహం, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన "గౌతమీపుత్ర శాతకర్ణి" లకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రజల సొమ్ముతో దర్జాగా మీరు అనందసందోహాల్లో కులకటమేమిటని ద్వనించేలా ఘాటుగా ప్రశ్నించింది, ఉభయ రాష్ట్రాల ఉమ్మడి న్యాయస్థానం.


Image result for rudramadevi SatakarNi


న్యాయస్థానం, గౌతమి పుత్ర శాతకర్ణి, రాణి రుద్రమదేవి - సినిమాలకు "వినోదపన్ను మినహాయించడం" పై పూర్తి వివరాలు తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పన్ను మినహాయించినప్పుడు దానికి సంబంధించిన ప్రయోజనాలను ప్రేక్షకులకు ఎందుకు ఇవ్వలేదని కోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు వారాల్లో వివరణ  ఇవ్వాలంటూ నటుడు బాలకృష్ణతో పాటు  "గౌతమి పుత్ర శాతకర్ణి" చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి, "రుద్రమదేవి" దర్శక నిర్మాత గుణశేఖర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది.


అవేమీ చిన్ననిర్మాతల సినిమాలు కావు. చాలా పెద్ద నటులు నటించిన సినిమాలు. వాటికి వినోదపు పన్నుని మినహాయించటం జాతికిగాని చరిత్రకు గాని అవసరమా! వ్యాపార దృక్పధంతో కమర్షియల్‌ అంశాల్ని కథలో జోడించి చేసినా, వినోదపు పన్ను మినహాయింపు పొందగలిగాయి అంటే ఆ రెండు సినిమాల నిర్మాతలో మరెవరో ప్రభుత్వలపై వత్తిడి చేసి తెలంగాణలో పన్ను మినహాయింపు పొందారు అతి సునాయాసంగా.


Image result for rudramadevi SatakarNi


కాని ఆంధ్రప్రదేశ్‌లో పన్ను మినహాయింపు "రుద్రమదేవి" కి దక్కలేదు. ఇంకో సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి' రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వినోదపు పన్ను నుంచి ఎంచక్కా మినహాయింపు పొందింది. గత రాజుల కాలములో "రాజుగారి బామ్మర్ది అదే రాజాశ్యాలకుల" ను అందలం ఎక్కించటం కోసం చట్టాలనే మార్చే సంస్కృతిని ఆంధప్రదేశ్ ప్రభుత్వం విజయవంతంగా అమలు పరచింది "బామ్మర్ది బాలకృష్ణ"  కోసమే అనేలా.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు వినోదపు పన్నును మినహాయించింది. అయితే ఈ వినోదపు పన్ను మినహాయింపులో భాగంగా, ప్రేక్షకుల కు టికెట్ ధరలో రాయితీ వంటి ప్రయోజనాలు ఇవ్వలేదంటూ  “సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం”  కార్యదర్శి వేణుగోపాలరావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం బాలకృష్ణతో పాటు ఇద్దరు నిర్మాతలకు నోటీసులు ఇచ్చింది.


Image result for rudramadevi SatakarNi


ఈ వ్యాజ్యంలో నటుడు బాలకృష్ణను ఎందుకు ప్రతివాదిగా చేర్చారని ధర్మాసనం అడిగింది. బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి కోసం ప్రభుత్వాలను ప్రభావితం చేశారని, వినోదపు పన్ను మినహాయింపు ద్వారా వచ్చిన సొమ్మును నిర్మాతతో పాటు ఈ కథానాయకుడు కలసి పంచుకుంటారనే పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం బాలకృష్ణ, నిర్మాత, ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.


'గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకి మాత్రమే ఆంధ్రా ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడంపై అప్పట్లో ‘రుద్రమదేవి’ నిర్మాత గుణశేఖర్ స్పందించారు. గౌతమిపుత్ర శాతకర్ణి లాగే చారిత్రాత్మక కథతో నిర్మించిన తన సినిమాకు కూడా అదే వినోదపు పన్ను ఎందుకు మినహాయింపునివ్వరని,  ఇప్పుడైనా అది వర్తింప చేయాలని కోరుతూ ఏపీ సీఎంకు ఓ లేఖ రాశారు. పన్ను మినహా యింపు ఇస్తే తనను ఆర్థికంగా ఆదుకున్నవారవుతారని కూడా లేఖలో గుణశేఖర్ పేర్కొన్నారు.


Image result for rudramadevi SatakarNi


కానీ ఇప్పుడు పన్ను మినహాయింపుపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్)  దాఖలు కావడం ఆయన్ని ఇబ్బంది పెట్టే సంధర్భమే.  మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగు తుందో కాలమే చెప్పాలి. మనం నిరీక్షించాలి.  ఏపిలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి  మాత్రమే పన్ను మినహాయింపు దక్కటం వెనుక తెరవెనుక బాగోతం జరిగిందనే అంటారు.


ఒక సినిమాకి నినోద పన్నుమినహాయింపు లభిస్తే,  ఆ చిత్ర నిర్మాతకి మంచి ఆదాయం లభిస్తుంది. కానీ, ఏ  విధమైన సినిమాలకు ఈ పన్ను మినహాయింపు ఇవ్వాలనే దానికి కొన్ని ప్రాధమిక "యోగ్యతా, అయోగ్యతలు" నిర్ణయం జరగాలి. అది ప్రభుత్వ ప్రధాన భాధ్యత. ఈ విషయంలో పాలకులు ఎంతో విజ్ఞత తో వ్యవహరించాలి అలాగే నిర్ణయాలు చేయాల్సి  వుంటుంది. నిర్మాణానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేసిన సినిమాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం అనేది ఎంతవరకు సమజసమనేది, విధి విధానాల్లో పొందుపరచిన మౌలిక సూత్రాలతో పోల్చి చూసుకోవాలి. విధానాలను పన్ను మినహాయింపు కోరిన సినిమాలన్నిటికి వర్తింపచేయాలి. అనుమానాలకు తావి వ్వకూడదు. ఆ అవకాశమే ఇవ్వకూడదు.


Image result for rudramadevi SatakarNi


'గౌతమిపుత్ర శాతకర్ణి' 'రుద్రమదేవి' సినిమాల విషయంలో ఆంధ్రప్రదెశ్ ప్రభుత్వం అనేకానేక అనుమానాలకు తావిచ్చింది. గౌతమి పుత్ర శాతకర్ణి' విషయంలో అయితే 'బామ్మర్ది బాలకృష్ణ ' అనే "పవర్-ఫుల్ రిజర్వేషన్" అనుమతించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చూపిన "బావమరది అనే ప్రేరేపిత అత్యుత్సాహం"  పన్ను మినహాయింపు కు దారిచ్చింది. నాడే దీనిపై విమర్శల జడివాన కురిసింది. ఆ విమర్శల సునామి అక్కడితో ఆగిపోలేదు.


“సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం" ఈ విషయంలో న్యాయస్థానం మెట్లెక్కింది. ఇప్పుడు బాలకృష్ణకీ, చిత్ర నిర్మాత, దర్శకిలకి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి కోర్ట్ నోటీసులు అందాయి. అదేవిధంగా రుద్రమదేవికి కూడా. కేసు విచారణ జరిగిన తరవాత తీర్పు వస్తే గాని ఏంజరుగుతుందో తెలుస్తుంది. పన్ను మినహాయింపుని ప్రేక్షకులకు పంచాలని పిటిషనర్‌ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రేక్షకులకు ఎలాగూ పంచలేరు. అయితే న్యాయస్థాన నిర్ణయం మాత్రమే దీనికి తుది రూపు ఇస్తుంది. ఇందులో "బందుప్రీతి" ఋజువైతే మాత్రం "ఏపి ముఖ్యమంత్రి పరువు బజారు పాలే". 


‘రుద్రమదేవి’ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేసిందనీ’ 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి వినోదపన్ను మినహాయింపు ఇచ్చి, తమ సినిమాకి వినోదపన్ను మినహా యింపు ఇవ్వకపోవడటని ప్రశ్నిస్తూ గుణశేఖర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. మరిప్పుడు, ఈ వివాదంలో ఆయనా న్యాయస్థానానికి సమాధానం చెప్పాల్సి వుంటుంది.


Image result for rudramadevi SatakarNi


“సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం" ఈ విషయంలో న్యాయస్థానం మెట్లెక్కింది. ఇప్పుడు బాలకృష్ణకీ, చిత్ర నిర్మాత, దర్శకులకి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి కోర్ట్ నోటీసులు అందాయి. అదేవిధంగా రుద్రమదేవికి కూడా. కేసు విచారణ జరిగిన తరవాత తీర్పు వస్తే గాని ఏంజరుగుతుందో తెలుస్తుంది. పన్ను మినహాయింపుని ప్రేక్షకులకు పంచాలని పిటిషనర్‌ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రేక్షకులకు ఎలాగూ పంచలేరు. అయితే న్యాయస్థాన నిర్ణయం మాత్రమే దీనికి తుది రూపు ఇస్తుంది. ఇందులో బందుప్రీతి ఋజువైతే మాత్రం ఏపి ముఖ్యమంత్రి పరువు బజారుపాలే. 


‘రుద్రమదేవి’ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేసిందనీ, ’గౌతమిపుత్ర శాతకర్ణి ‘కి పన్ను మినహాయింపు ఇచ్చి, తమ సినిమాకి ఇవ్వకపోవడం ఏమి న్యాయ మని ఘోషించి,  ప్రశ్నిస్తూ గుణశేఖర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. మరిప్పుడు, ఈ వివాదంలో ఆయన కూడా న్యాయ స్థానానికి సమాధానం తప్పని సరిగా చెప్పాల్సి వుంటుంది.


Image result for rudramadevi SatakarNi

మరింత సమాచారం తెలుసుకోండి: