దేశంలో నదులను అనుసంధానం చేసిన ఏకైక మగాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన ఉగాది ఉత్సవాలలో ఆయన తళుక్కున మెరిశారు. ఈ సందర్భంగా ఆయన బాబును శాలువాతో సన్మానించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ,



అంతటి ఘనత సాధించిన చంద్రబాబుకు ఏదైనా బహుమతి ఇవ్వాలని ఉందని అన్నారు. అనంతరం నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ ఆయనను ఆలింగనం చేసుకుని ఆయన బుగ్గపై ముద్దు పెట్టుకున్నారు. దీంతో సభికులందరూ పెద్దగా నవ్వారు. ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన తొలి ఉగాది వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అమరావతి రాజధానిని చంద్రబాబు అద్భుతంగా నిర్మిస్తారని ఆయన పేర్కొన్నాడు.  ముఖ్యమంత్రి పలు పంచాంగాలను ఆవిష్కరించారు.


Image result for chandra babu rajendra prasad

తితిదే, వ్యవసాయ, ఉద్యాన, పోలవరం, తదితర పంచాంగాలు, భాషా సాంస్కృతిక శాఖ క్యాలెండర్లు, సీడీలను వేదికపై మంత్రులతో కలసి విడుదల చేశారు. జానపద రంగానికి సంబంధించి ప్రముఖ కళాకారుడు వంగపండు ప్రసాదరావును కళారత్న పురస్కారాన్ని ఇచ్చి ముఖ్యమంత్రి సత్కరించారు. తొలిసారిగా జానపద రంగానికి చెందిన వ్యక్తిని సన్మానించినందుకు చంద్రబాబుకు రెండు నమస్కారాలు అంటూ వంగపండు ప్రస్తుతించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: