కొండ చిలువలు జంతులనే ఎక్కువ శాతం వేటాడి చంపుతుంటాయి. కానీ మనుషులను చంపి తినడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే కొండ చిలువకు జంతువు వాసన బాగా నచ్చుతుంది. మనిషి వాసన పట్ల కొండ చిలువ అంతగా ఆసక్తి కనబరచదు. కానీ ఒక కొండ చిలువ స్వయానా మనిషిని వేటాడి అమాంతం మింగేసింది. ఇండోనేసియాలో ఓ వ్యక్తిని భారీ కొండచిలువ మింగేసింది.



సులవెసి ద్వీపంలోని సలుబిరో గ్రామంలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఇండోనేషియాలో అదృశ్యమైన ఓ రైతు.. ఓ భారీ కొండచిలువ కడుపులో దొరికాడు. తన వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటుండగా ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు.  తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు సోమవారం ఆయన కోసం గాలింపు మొదలుపెట్టారు. అక్బర్‌ పొలం సమీపంలోనే కదల్లేని స్థితిలో ఉన్న ఓ కొండచిలువను గుర్తించారు. దాని పక్కనే పనిముట్టు, ఓ బూటు పడి ఉండటంతో సందేహం వచ్చి.



కొండచిలువను కత్తితో చీల్చి చూశారు.  అందులో అదృశ్యమైన రైతు మృతదేహం లభించింది. ఇండోనేషియా తూర్పు సులావేసి దీవులలోని సలుబిరో గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొండచిలువ అక్బర్‌ను పూర్తిగా మింగేసిందని.. ఇలాంటి ఘటన ఈ ప్రాంతంలో జరగడం ఇదే తొలిసారి అని గ్రామస్థులు తెలిపారు. చిన్న చిన్న జంతువులపై దాడి చేసే కొండ చిలువలు.. మనుషులను తినేందుకు ప్రయత్నించడం చాలా అరుదు. 2013లోనూ బాలి ద్వీపంలో ఇలాగే ఓ వ్యక్తిని కొండచిలువ బలి తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: