ఆంధ్రాలో అసెంబ్లీ స‌మావేశాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. అటు లోకేశ్ కూడా ఎమ్మెల్సీ అయ్యాడు. సో.. ఇక మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం అయినట్టే.. లోకేశ్ కు మంత్రివర్గంలో బెర్త కన్ ఫామ్ అయిన సంగతి తెలిసిందే. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాదు.. మరికొందరిపై వేటు కూడా వేసేందుకు చంద్రబాబు కసరత్తు పూర్తి చేస్తున్నారట. 



అందుకే ఇప్పుడు టీడీపీలో మంత్రివర్గ ప్రక్షాళనపై జోరుగా చర్చ సాగుతోంది. ఎవరి పదవులు ఊడిపోతున్నాయ్.. కొత్తగా ఎవరికి పదవులు వస్తున్నాయ్ అనే అంశాలపై ఎవరికి తోచినట్టు వారు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. చంద్రబాబు తన మంత్రివర్గం నుంచి కనీసం నలుగురికి గుడ్ బై చెబుతున్నారట.. వారిలో మొదటి వరుసలో ఉండే పేరుగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని చెబుతున్నారు.



ఈయనపై రాజకీయంగా, అవినీతి పరంగా ఎలాంటి వివాదాలు లేకపోయినా.. అనారోగ్యం కారణంగా ఆయన్ని తప్పిస్తారని తెలుస్తోంది. ఆయన చురుగ్గా లేకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈయనతో పాటు ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి కూడా పదవీగండం పొంచి ఉందట. ఈయన తన శాఖలను సరిగ్గా నిర్వహించడం లేదన్న అసంతృప్తి ముందు నుంచీ చంద్రబాబులో కనిపిస్తోంది. 

Image result for bojjala gopalakrishna reddy


ఇక మూడో మంత్రిగా రావెల కిషోర్ బాబు పేరు తెరపైకి వస్తోంది. గతంలో ఏకంగా కేబినెట్ మీటింగ్ లోనే రావెలకు చంద్రబాబు తలంటినట్టు వార్తలు వచ్చాయి. అసలు పార్టీకి ఏమాత్రం సంబంధం లేకపోయినా పార్టీ సభ్యత్వం ఇచ్చి మంత్రిని చేస్తే నాకు చెడ్డపేరు తెస్తారా అని మండిపడ్డారు కూడా. పైగా ఆయన కొడుకు వ్యవహారం, గుంటూరు నాయకురాలు జానీమూన్ తో గొడవ ఆయనకు మైనస్ పాయింట్లుగా మారాయి. 




ఆ తర్వాత ఔట్ లిస్టులో పీతల సుజాత,  ప్రత్తిపాటి పుల్లారావు పేర్లు కూడా వినిపిస్తున్నా.. పుల్లారావును తీయకపోవచ్చు. మొన్నటికి మొన్న జగన్ ను సవాల్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు వేటు వేస్తే.. అది జగన్ కు ప్లస్ అవుతుంది కాబట్టి ప్రత్తిపాటి విషయంలో చంద్రబాబు ఆలోచిస్తున్నారట. మరి చివరకు బాబు ఏం తేలుస్తారో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: