ఏప్రిల్ 30, 2017.. నారా లోకేశ్ జీవితంలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆయన తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టబోతున్నాడు. అధ్యక్షా.. అంటూ ఉపన్యాసం దంచే అవకాశం దక్కించుకున్నరోజు ఇది. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనకపోయినా.. ఎమ్మెల్యే కోటాలో అయినా సరే.. ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు ఇది. 


చాలా మంది రాజకీయ నాయకులకు ఇది ఒక కల. ఐతే.. మంత్రి వంటి ఉన్నత పదవులు అలంకరించడానికి ఒక సోపానం. లోకేశ్ విషయంలో మాత్రం శాసన మండలి సభ్యత్వం, మంత్రిపదవి రోజుల తేడాలోనే వచ్చేస్తున్నాయి. ఆయన శాసన మండలి సభ్యుడు కావడంతో మంత్రి అయ్యేందుకు మార్గం సుగమం అయిపోయింది. కొన్ని రోజుల్లోనే ఆయన మంత్రి కూడా కాబోతున్నారు. 



నారా లోకేశ్ తో పాటు మరో 15 మంద టీడీపీ నాయకులు కూడా ఎమ్మెల్సీలుగా అసెంబ్లీ ప్రాంగణంలో అడుగుపెట్టబోతున్నారు. మొత్తం ఆంధ్రా శాసన మండలి సభ్యుల సంఖ్య 58. ఇప్పుడు టీడీపీకి ఇందులో 40కిపైగా సభ్యులు ఉన్నారు. రేపు మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎన్నిక జరగుతుంది. ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న సతీష్ రెడ్డి పదవీకాలం పూర్తయింది. 


రేపు కొత్త డిప్యూటీ ఛైర్మన్ ను ఎన్నుకుంటారు. చీఫ్ విప్ తో పాటు ఇతర విప్ పదవులు కూడా భర్తీ చేయాల్సిఉంది. అంతే కాదు.. మే నెలాఖరకు  ప్రస్తుత శాసన మండలి ఛైర్మన్ చక్రపాణి పదవీ కాలం కూడా పూర్తవుతోంది. నారా లోకేశ్  ఎమ్మెల్సీగా.. మంత్రిగా తన సామర్థ్యాన్ని ఎంతగా నిరూపించుకుంటాడో చూడాలని అటు అధికార పార్టీ, ప్రతిపక్షం ఆసక్తిగా గమనిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: