మాజీ సీఎస్ రమాకాంత రెడ్డి ని కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటర్వ్యూ చేస్తూ ఒక సంచలన వీడియో ఇప్పుడు మీడియా వర్గాల్లో డిస్కషన్ కి తెర లేపుతోంది . మీడియా వారు , రాజకీయాల వారు ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సందర్భంగా ఆయన మీద కేసులు నిలిచే ఛాన్స్ లేదు అంటూ కొమ్మినేని హడావిడి ఇంటర్వ్యూ చేసారు. పైగా విషయం స్వయంగా తాను జేడీ లక్ష్మీ నారాయణ కే చెప్పాను అంటున్నారు కొమ్మినేని. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈయన అలా అన్నప్పుడు జేడీ నవ్వేసి ఊరుకున్నారట అది మరీ విడ్డూరంగా అనిపించింది. రమాకాంత రెడి మాజీ ఐఏఎస్ వ్యక్తి , ఆయన మీద కూడా చాలా విమర్సలూ, ఆరోపణ లూ ఉన్నాయి.


ఐఎస్సై ఆసుపత్రుల కుంభకోణం లో ఆయన పాత్ర కూడా ఉంది అంటూ బాగానే వార్తలు వినపడ్డాయి అప్పట్లో. మిగితా విషయాల గురించి మాట్లాడకుండా జగన్ కేసు విషయం లో ప్రత్యేకంగా కొమ్మినేని ఇంటర్వ్యూ చెయ్యడం ఆసక్తికరంగా ఉంది. ఇద్దరూ కలిసి సీబీఐ క్యాబినెట్ ఫంక్షనింగ్ మీద కూడా అవగాన లేదు అన్నట్టు మాట్లాడారు ఆయన. ఇది భలే విడ్డూరమైన విషయం. కేసుని ప్రభావితం చేసే విషయం లో ఇంటర్వ్యూ చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది అని అర్ధం అవుతోంది. అనవసరం గా స్వయం కృత అపరాధం లాగా కేసు గురించి ఇప్పుడు అవసరం లేని ఇంటర్వ్యూ ని స్టార్ట్ చేసారు అనే ఫీలింగ్ అందరిలో కలిగింది.


సాక్షి జగన్ కి సొంతం అయిన ఛానల్ కాబట్టి ఎదో ఒక ప్లాన్ వేసి సీబీఐ తనని ఏమీ చెయ్యలేదు అని చెప్పించుకోవడం తప్ప సరైన లాజికల్ డిస్కషన్ లు ఎక్కడా కనపడ్డం లేదు . అనవసర వాదనలు నడుపుతూ సీబీఐ ని మళ్ళీ మళ్లీ తలనొప్పులు తెచ్చుకోవడం తప్ప జనం కానీ సీబీఐ కానీ ప్రభావితం అవుతాయి అనుకోవడం కామెడీ. చంద్రబాబు నో మరేవర్నో విమర్శిస్తే ఏం నష్టం ఉండకపోవచ్చు కానీ ఏకంగా సీబీఐ నే రెచ్చగొట్టడం అంటే అర్ధం లేని విషయమే .


మరింత సమాచారం తెలుసుకోండి: