తెలుగు ఇండస్ట్రీలో మహానటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన నటులు నందమూరి తారక రామారావు.  సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఆయన వేయని పాత్రలంటూ లేవు.  కేవలం నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల మన్ననలు అందుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్.  అయితే ఎన్టీఆర్ ‘తెలుగు దేశం’ పార్టీ పెట్టడానికి కారణం తానే అంటున్నారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
Image result for sr ntr chandrababu
 కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను సినిమాటోగ్రపీ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థను మార్చడం తన ఒక్కడి వల్లా కాదని వ్యవస్థను మార్చాలంటే మీవంటివారు రాజకీయాల్లోకి రావాలని తాను సలహా ఇచ్చినందువల్లే ఎన్టీఆర్ రాజకీయ పార్టీని పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు గత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.  పార్టీ ఆవిర్బావదినోత్సవాన్ని పురస్కరించుకొని  గుంటూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పార్టీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులను ఆయన గుర్తు చేసుకొన్నారు.  
Image result for sr ntr chandrababu
తాను ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందన్నారు బాబు. తాను అనారోగ్యం పాలైతే రాష్ట్రానికి కూడ సుస్తీ చేస్తోందని చెప్పారు.ఈ సందర్భంగా తన ఆరోగ్య రహస్యాలను కూడా చంద్రబాబు కార్యకర్తలతో పంచుకున్నారు. తన భార్య చేతిలో ఉండే రిమోట్ నన్ను అదుపులో ఉంచుతుంది కాబట్టి తాను ఆహార నియమాలను చాలా బాగా పాటిస్తాను. బతకడానికి తింటాను కానీ తింటానికి బతకను అని బాబు చెప్పారు. పైగా తాను అరోగ్యంగా ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని, నేను ఆనారోగ్యం పాలైతే రాష్ట్రానికే సుస్తీ చేస్తుందని చంద్రబాబు చెప్పారు


మరింత సమాచారం తెలుసుకోండి: