ఏపీలో గత కొంత కాలంగా అగ్రీ గోల్డ్ రగడ కొనసాగుతూనే ఉంది. ఎంతో మంది అగ్రిగోల్డ్ సంస్థను  నమ్మి పెట్టుబడులు పెడితే..వారికి శఠగోపం పెట్టి దివాలా తిసిందని బోర్డు తిప్పేశారు   సంస్థ యాజమాన్యం.  దీంతో ఎంతో మంది రోడ్డు పడ్డారు..కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.  ఈ అంశం పై ఏపీ అసెంబ్లీలో పెద్ద చర్చలే జరిగాయి.  ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అగ్రీగోల్డ్ బాధితుల తరుపు నుంచి అధికార పార్టీ ని నిలదీస్తున్నారు.  తాజాగా  అగ్రిగోల్డ్ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తీవ్రంగా స్పందించారు.

అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలనుకుంటే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. ఈ అంశంపై ఓ టాస్క్ ఫోర్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. భవిష్యత్తు మీద ఆశతో పేదలు అగ్రిగోల్డులో పెట్టుబడులు పెట్టారన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏజెంట్ల తప్పు లేదన్నారు. ఏజెంట్ల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నారు. ‘‘అగ్రిగోల్డ్ కు లక్షా 40వేల మంది ఏజెంట్లు ఉన్నారు. ప్రజల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన కంపెనీ ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారంలో ఏజెంట్ల తప్పేమీ లేదు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి భూములు కొన్నారు.

 Image result for pawan kalyan agrigold

సుబ్రతరాయ్ సహరా కేసు కూడా అగ్రిగోల్డ్ లాంటిదే. ఆయన ఆస్తులమ్మి బాధితులకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ లో కూడా శారద స్కాం, ఒడిశాలో కూడా ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు బాధితులకు అండగా నిలిచాయి. ఈ విషయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం మెడలు వంచైనా బాధితులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భాధితులకు న్యాయం చేసేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో మొదట్లోనే చెక్కులు బౌన్స్ అయినప్పుడు చర్యలు తీసుకుంటే బాగుండునని చెప్పారు.
Image result for pawan kalyan agrigold
గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తీసుకు వెళ్లవద్దన్నారు. తమ తప్పు లేకుండానే తీవ్ర ఇబ్బందులు పడుతున్న అగ్రీగోల్డ్ ఏజంట్లను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం దిగిరావాలన్నారు. 1995లో ప్రారంభించిన కంపెనీ ఇదని, వీళ్ల పెట్టుబడులన్నీ పేదల నుంచి పెట్టుబడులు స్వీకరించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. పేదలు కాబట్టే ఈ కేసులో ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయన్నారు. చట్టం బలహీనులపై బలంగా, బలవంతులపై బలహీనంగా పని చేస్తోందని, తప్పు చేస్తే ప్రశ్నించే దమ్ము, ధైర్యం సమాజానికి ఉండాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. న్యాయం జరగకుంటే వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తానని చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: