దమ్ముంటే మా సవాల్‌ స్వీకరించండి: వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సీబీఐ విచారణ జరిపిస్తే మంత్రి నారాయణ పాత్ర బయటకు వస్తుందని ఆయన అన్నారు. దమ్ముంటే తమ సవాల్‌ను స్వీకరించాలని వైఎస్‌ జగన్‌ అన్నారు.  ప్రభుత్వం అడ్డగోలుగా వాదించి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.


వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు వ్యక్తిగత దూషణలు

పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వకుండా ఎదురు దాడికి దిగింది. సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రశ్నాపత్రం లీకేజీపై సమాచారం ఇచ్చిన సాక్షి మీడియాపై ఆయన ఈ సందర్భంగా అక్కసు వెళ్లగక్కారు. నారాయణ, శ్రీచైతన్య సంస్థలు అంతా తమకు సమానమే అని చెప్పుకొచ్చారు. 

పెద్దల సభలో అడుగుపెట్టిన లోకేష్..


చిన బాబు నారా లోకేష్ పెద్దల సభలో అడుగుపెట్టారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వాత ఏపీ శాసనమండలిలోకి వెళ్లి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. లోకేష్‌ను అభినందించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శాసనమండలి సభ్యుడుగా ప్రమాణం చేశారు. 

బాలయ్య ఇంటికి ముప్పు !

జీహెచ్‌ఎంసీకి వచ్చిన రోడ్డు విస్తరణ ప్రతిపాదనతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి గండం వచ్చేలా ఉంది. జీహెచ్‌ఎంసీ రోడ్ల విస్తరణలో భాగంగా జూబ్లీ చెక్‌పోస్టు నుంచి రోడ్‌ నెంబర్‌ 45 వరకు రోడ్డు విస్తరణ చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ స్టాండింగ్ కమిటీ నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ముందుకు ప్రతిపాదన వచ్చింది. ఈ మధ్యలో ఉన్న భవనాలను, స్థలాలను భూసేకరణ ద్వారా తీసుకోవాలన్నది ఆ ప్రతిపాదనలోని ప్రధానాంశం.

సూపర్-స్పీడ్ నెట్ ఇప్పుడు హైదరాబాద్ లో...

సూపర్-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులు ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా అందుబాటులోకి వచ్చేశాయి. సెకనుకు 1గిగా బిట్ స్పీడు కలిగిన సూపర్ స్పీడు ఇంటర్నెట్ సేవలను ఏసీటీ ఫైబర్ నెట్  హైదరాబాద్ లో లాంచ్ చేసింది. వీటి ప్రీమియం ధర రూ.5999లేనని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు నివేదించింది. సెకనుకు 1 గిగాబిట్ స్పీడు ఇవ్వడం దేశంలోనే తొలిసారి. 



మరింత సమాచారం తెలుసుకోండి: