Image result for amit shah & chandrababu kcr



రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్తిగా ప్రతిపక్ష సభ్యుల్ని తమపార్టీలోకి లాగేసుకున్నారు ఇద్దరు చంద్రులు. ఎంతలా అంటే కక్కుర్తి తో పుక్కటికి దొరికిన అన్నం ఆబగా లాగించే బిచ్చగాళ్ళే నయమనేలాగా. వీళ్ళ దురద తెలిసిన కేంద్రం మెత్తగానే తగల రాని చోట బలంగానే దెబ్బేసిందిలాఉంది.


Image result for amit shah & chandrababu kcr


రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా పచ్చి వ్యభిచారుల కంటే హీనంగా ప్రవర్తించిన ఫిరాయింపు దారులను పార్టీల్లో చేర్చేసుకున్నాయి. కొందరిని నయాన మరికొందరిని భయాన ఇంకొందరిని లోభంతో, ఇంకొద్దిమందిని ప్రలోభంతో ఇంతకుముందు పార్టీతో ఏమాత్రం పొసగని నేతలను సైతం తమ గూటికి సిగ్గు లేకుండా స్వాగతించాయి. ఇంత వరకు అంతా బాగానే ఉంది గానీ ప్రతిపక్ష సభ్యుల చేరిక సొంత పార్టీ నేతలకు కొత్త కష్టాలను తీసుకొచ్చింది. 


Image result for kcr cbn problems with jumped mlas



రానున్న ఎన్నికల్లో తమ సీట్లకు ప్రతిపక్ష సభ్యులు ఎక్కడ గండి కొడతారోనని అధికారపార్టీలో పాతకాపుల ఆవేదన. అంతే కాదు, ఇటీవలి అంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్వవ్యస్థీకరణలోను ప్రతిపక్షం నుంచి వచ్చినవారికే పార్టీ పెద్ద పీట వేయడంతో, ఈ అనుమానాలు వారిలో మరిన్ని రెట్లు బలపడ్డాయి. వచ్చే 2019 ఎన్నికల నాటికి శాసనసభ  సీట్ల పెంపు గనుక జరగపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ఇది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. 


Image result for amit shah & chandrababu kcr

BJP's mission two states


పార్టీలో నాయకుల సంఖ్య ఎక్కువైపోవడంతో ఎవరికి టికెట్లు దక్కుతాయో? ఎవరికి దక్కవో? తెలియని దుస్థితి వారిని పీడించ గా చివరకు అది అలకలు, అసంతృప్తులు, తిరుగుబాట్లతో పార్టీ లో ముసలం పుట్టుకురావడానికి దారితీసే అవకాశం లేకపోలేద ని పరిశీలకుల కథనం. ఇంకేం అమిత్-షాహ్ మాత్రం ఫుల్ ఖుషీ. ఎందుకంటే సీట్లు సింపుల్ గా 2024 లో పెంచుతాడు. ఇక్కడ ఆస్చర్యం లేదు ప్రత్యక్షంగానో పరొక్షన్ గానో అధికారం లోకి బిజెపి ని తెచ్చే కార్యక్రమం లో నిమగ్నమైనట్లు డిల్లీ నుండి వార్త లు వినిపిస్తున్నాయి. అందుకే కెసిఆర్ నిశ్శబ్దంగా ప్రస్తుతానికి మంత్రివరగాన్ని విస్థరించట్లేదు.


Image result for kcr cbn problems with jumped mlas



గత నవంబర్ లోనే పార్లమెంట్ లో అస్సెంబ్లి సీట్ల పెంపకం పై వివరణ లభించింది 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించకుండా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం కుదరదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో సభ్యుడు టి.జి.వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ ఈమేరకు సమా ధాన మిచ్చారు. "పీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? వస్తే సంబంధిత వివరాలు వెల్లడించండి." అన్నది టిజి వెంకటేష్ ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: