సోషల్ మీడియా.. ఇప్పుడు జనం తమది గా భావిస్తున్న మీడియా ఇది. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు తమకు నచ్చిన వారి కొమ్ముకాస్తుండటంతో సోషల్ మీడియా బాగా హైలెట్ అయ్యింది. ఇందులో కేవలం చూడటమే కాదు.. స్పందించే అవకాశం కూడా ఉండటంతో సోషల్ మీడియా ఇప్పుడు ఎన్నో నిజాలు ప్రజలకు చేరవేస్తోంది. 


కానీ అదే సోషల్ మీడియాలో అవాస్తవాలూ జోరుగా ప్రచారం అవుతూనే ఉంటాయి. ఏది నిజమో.. ఏది అవాస్తవమో చెప్పలేని పరిస్థితి. అయితే సోషల్ మీడియాలో కొందరు నాయకులు ఎక్కువగా టార్గెట్ అవుతుంటారు. కొందరిపైనే ఎక్కువగా జోకులు, సెటైర్లు పేలుతుంటాయి. ఉదాహరణకు బాలకృష్ణ, రజనికాంత్ వంటి హీరోలు, జలీల్ ఖాన్, లోకేశ్ వంటి నాయకులు ఏంచేసినా అది వైరల్ అవుతుంటుంది. 


ఇప్పుడు అదే నారా లోకేశ్ కోపానికి కారణమవుతోంది. వివిధ సందర్భాల్లో లోకేష్ నోరు జారడం, ఆ విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీయడం ఆయనకు ఎక్కడో కోపం తెప్పించాయి. తాజాగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగిస్తూ అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అని లోకేష్ వ్యాఖ్యానించడం.. దానిపై నెటిజన్లు జోరుగా స్పందించడం మరోసారి ఆయన ఇగోను హర్ట్ చేశాయట. 


అందుకే ఈ పరిణామాలపై ఐటీ మంత్రిగా లోకేశ్ ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్ష జరిపారట. నెటిజన్లు విస్తారంగా షేర్ చేస్తున్న పేరడీ వీడియోలను, ఫొటోలను గుర్తించాలని.. వాటిని పోస్టు చేసిన వారికి నోటీసులు పంపాలని లోకేష్ అధికారులకు ఆర్డర్ వేశారట. నెటిజన్లు ఆ నోటీసులకు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారట. అందుకే సోషల్ మీడియాలో లోకేశ్ పై కామెంట్ పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టండి..



మరింత సమాచారం తెలుసుకోండి: