Image result for up cm yogi adityanath


యోగీ  ఆదిత్యనాధ్ ఒక సుడిగాలి. దూసుకు వెళ్ళే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేస్ యువ ముఖ్యమంత్రి అని గత నెలరోజు లుగా (నేటితో) ఋజువుచేస్తూ వస్తున్నారు. ఆయన ఆశిస్తారు శాసిస్తారు. ఆయన దేన్నైతే ఆశిస్తారో దాన్నే సాధించటానికి శాసిస్తారు. ఉత్తర భారతం లో ముఖ్యంగా యుపి అధికార యంత్రాంగములో ఉండే స్థబ్ధత మటుమాయమైంది. మద్యలో గడి బిడి శషబిషలు ఉండవు. నీ వాళ్ళు నావాళ్ళు అనే లెక్కలు ఉండవు.


స్వచ్చ భారత్ రూపములో పరిశుభ్రత మాత్రమే కాదు అవినీతి అలసత్వ నిర్మూలనలాంటి అంశాలూ ఆయన నేతృత్వములో అతి సునాయాసమైన పనులే. పని రాక్షసుడని ప్రజలు గుర్తించారు.


Image result for up cm yogi adityanath



పత్రికల ముఖ్య శీర్షికల కెక్కిన అనేక విషయాలివి:


*ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ గుట్కా నిర్మూలన

*100 మంది పైగా అవినీతి పోలీసుల ఉద్యొగ తాత్కాలిక భహిష్కరణ

*చట్టసమ్మతం గాని  పశువధ శాలలపై బాన్

*యాంటి రోమియో స్కాడ్ల నియామకం - అంటే ఈవ్ టీజర్లపై డేగ కన్ను అన్నమాట

*అధికారం లోకి రాగానే గత ప్రభుత్వాల పని పద్దతులను ఒక్కసారుగా మార్చకుండా అలసత్వాన్ని రూపుమాపుతూ అధికార యంత్రాంగాం పై పట్టు *సాధించటం అతి గొప్ప విషయం మాత్రమే గాదు అది ప్రజ్ఞ ప్రతిభతో కూడినది.

*తన తొలి ముఖ్యమైన అధికార పాలనా సంస్కరణలు 44 మంది ఐఏఎస్ అధికారుల స్థాన చలనం ద్వారా నిన్ననే ప్రారంభించారు. కరక్ట్ గా ఒక నెల పరిస్థితులపై అవగాహన పొందిన తరవాత వేగంగా కదిలారు. ఒక పదిరోజుల క్రితమే 20 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్రం వెలుపలకు పంపించి 8 మందిని వెయిట్ లిష్ట్ లో పెట్టటటం అనేది ఆయన పాలనలోని లోని పరుగు వేగమును స్పృజిస్తున్నాయి. 


Image result for up cm yogi adityanath


అయితే ఆయన దృష్టి పెట్టిన ముఖ్యాంశాలు 16 అని చెపుతున్నాయి ప్రధాన పత్రికలు: వాటిని పరిశీలిద్ధాం.


1. ఆస్తుల ప్రకటన వెల్లడి: తాను పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మార్చి 19 న ఒక గంటలోపే తన మంత్రులు అధికారు లంతా తమ ఆదాయం, స్థిర చర ఆస్తులు 15 రోజుల్లో రాష్ట్ర సచివాలయానికి అందజెయాలని ఆదేశించారు. అంతే కాదు వారంతా వారి సత్యశీలత, పరిశుభ్రతపై శపధం చేయాలని శాంతిభద్రతలు, అవినీతి రహితత్వం అనేవి తన పాలనలో క్షమార్హం కాని నేరాలని ఖరాఖండిగా చెప్పారు. వాటిని ఈషణ్మాత్రం (జీరో టోలరెన్స్) క్షమించకూడని విషయాలని నిర్మొహమాటంగా చెప్పారు. తాను విధించిన తుది గడువు (డేడ్ లైన్) పై కూడా కఠినాత్మకంగా గమనిస్తున్నారు పరిశీలిస్తున్నారు. గుర్తుచేస్తున్నారు.   


2. పరిశుభ్రత మరియు సత్యశీలతా పాలన: ప్రతి ఉద్యోగి వారానికి 2 గంటలు స్వచ్చత పరిశుభ్రతపై గురి పెట్టాలని వీటికై చేసిన శపథాన్ని అనుసరించాలని అలక్ష్యం తగదని మరీ మరీ సంధర్భం లభించిన చోటల్లా గుర్తుచేస్తున్నారు. పని చేసే స్థలాన్ని చక్కగా సర్ది శుభ్రంగా ఉండేలా "ప్రతి శుక్రవారం - శుబ్రతా వారం" గా పాటించాలని అదేశించారు. అంతేకాదు 2017 ఎన్నికల్లో ఖరారు చేసిన భారతీయ జనతా పార్టీ విధివిధానాలను (మానిఫెస్టో) సరిగా అవగాహన చేసుకుని తమతమ శాఖల్లో ఎలా అమలు పరచాలో నిర్ణయించే భాధ్యత వారిపై ఉందని బలంగా చెప్పారు. అలాగే అన్నీ శాఖల పనులన్నీ అనుమతించిన పద్దుల పరిధిలో (బడ్జెటరీ అలకేషన్స్ లోపలనే) చూడాలని ఆదేశించారు. 


3. ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాలయాల్లో, వైద్యాలయాలలో గుట్కా పాన్ సంపూర్ణ నిషేధం అనేది ఆయన తొలి రోజే ఆదేశించిన ముఖ్య విషయం.


4. చట్టం నిషేదించిన మాంసాహారం పై ఆంక్షలు: పాలన చేపట్టగానే యోగీ ఆదిత్యనాద్ చట్టం అనుమతించని గొవధశాలలు, గోవుల అక్రమ తరలింపు మరియు వ్యాపారాలను వ్యాపారశాలను మూసివేసి కొన్నింటిని తగల బెట్టించారుదాని వలన వ్యాపారులు మాంసం సరపరా అపేసి సమ్మెకు దిగినప్పుడు ప్రభుత్వ అనుమతిలేని చట్ట బద్దం కాని వ్యాపారాలని మాత్రమే తాము లక్ష్యంగా తీసుకున్నామని ఆయన వివరణ యిచ్చారు.


5. యాంటి రోమియో స్క్వాడ్స్ వ్యవస్థాపన: స్త్రీలపై లైంగిక వేదింపులు జరిపేవారి పై పెద్ద యెత్తున పోలీసులతో అణచివేసే వ్యవస్థని నిర్మించారు. కొన్ని సంధర్భాలలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన సందర్భాలలో వారిని సహనంగా వ్యవహరిస్తూనే నేరస్తులపై అవగాహన పెంచుకొని వారిని కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించి మహిళల మన్ననలను పొందారు.  దీనికోసం మార్చి 25 ననే విధివిధానాలను రూపొందించి మానవత దృక్పదంతోనే లైంగిక వేదింపులపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని కోరారు.





6. పాలనలో పరులు కలజెసుకోవటం నిషేదించారు: మార్చి 21 న ప్రధాని నరెంద్ర మోడీని కలసి వివిధ శాఖలకు మంత్రులను నియమించే విషయములో సలహాలు సంప్రదిపులు జరిపారు. తదనుగుణంగా  ఆదేశాలు స్వీకరించి కేంద్రము నుండి అనేకమంది మంత్రులు, పార్లమెంట్ సభ్యులు తన పాలనలో ఉద్యోగుల బదిలీలు నియామకాలు పోష్టింగ్స్ విషయములో గాని  వ్యవహారాలలొ గాని కాంట్రాక్టర్ల నియామకాల విషయములోగాని ఇతరత్రా ఏవిధమైన పైరవీలు, రికమండేషన్లు,లాబీలు చేయకుండా ఉండాలని కోరగా ప్రధాని ఆ మేరకు వారందరికి మార్చి 23న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రపాలనలో కలగ జేసుకోరాదని నిర్ద్వందంగా అదేశించారు.   


7. గోతులను లేని రహదారుల్లో కోసం ఆదేశం: జూన్ 15 లోగా రహదారుల్లోను గోతుల రహితంగా మార్చాలని ఆయా శాఖలకు అదేశాలిచ్చారు.


8. మెట్రో రైల్ ప్రోజెక్ట్స్: తన నియోజక వర్గం గోరక్ పూర్ మరియు ఝాన్సి ల్లో మెట్రో రైల్ ప్రోజెక్ట్స్ ను ప్రవేశపెట్టే ఆదేశాలిచ్చారు. దానికి తగిన ఏర్పాట్లు చూడాలని అదేశించారు.


9. అలసత్వ నిర్మూలన: తన ప్రభుత్వములో మంత్రులు అధికారులు తమ అలసత్వాన్ని, అలక్ష్యాలను, సోమరితనాన్ని వదిలేసి పనిలో వేగం, క్రమశిక్షణ, సమయ పాలన, గుణాత్మకత, పరిమాణాత్మకత సాధించాలన్నారు. అవసరమైనప్పుడు ప్రజల కోసం 18-20 గంటలు పనిచేయలేని అధికారులు ఉద్యోగులు తమ ఉద్యోగాలను శాశ్వితంగా వదిలేసి వెళ్ళొచ్చన్నరు. అలాగే రోజూ తమతమ కార్యాలయాల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటలవరకు ఎల్లవేళలా ప్రజల కోసం  సిద్ధంగా ఉండాలన్నారు. అనేక మంది మంత్రులు సమాచారం లేకుండా కార్యాలయాలను సందర్శిస్తారని సమయపాలనను పరిశీలిస్తారని చెప్పారు.


10. రైతు ఋణ విముక్తి: బిజెపి ఎన్నికల ప్రకటన ప్రణాళిక పత్రం (మానిఫెస్టో) లో నిర్దేశించిన వాగ్ధానం చేసిన ఈ విషయాన్ని ఏప్రిల్, 4న జరిగిన తొలి మంత్రి మండలి సమావేశములో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా 2.15 కోట్ల చిన్న మద్యతరగతి రైతులకు ఒక లక్ష రూపాయిల వరకున్న బాంకు ఋణాల నుండి విముక్తిని ప్రసాధించారు. దీనివలన మొత్తం 36000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర బడ్జెట్ పై పడింది.


ఈ సమావేశములోనే తూర్పు ఉత్తర ప్రదేస్ లోని యోగీ ఐదు సార్లు గెలిచిన గొరక్-పూర్ నియోజకవర్గం లోని ఘాజీపూర్ లో "క్రీడా ప్రాంగణం" (స్పోర్ట్స్ స్టేడియం) నిర్మాణానికి మంత్రి మండలి అంగీకారం అమోదం లభించింది. 


Image result for up cm yogi adityanath



11. గోధుమ ఆలుగడ్ద పంట సేకరణ: 80 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను రాష్ట్ర వ్యాప్తంగా 5000 సేకరణ కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరించటానికి ఏర్పాట్లు చేయటానికి నిశ్చయించారు. అలాగే రైతు నుండి క్వింటాలుకు  రూ.487/- ఆలుగడ్డ సేకరణ ధరగా నిర్ణయించారు.


12. పారిశ్రామిక విధానం: రాష్ట్రములో పారిశ్రామిక అభివృద్ది వేగవంతం చేయటానికి నిరుద్యోగ నిర్మూలనకు ఆధికాభివృద్దికి తగిన నూతన పారిశ్రామిక విధానాన్ని అతి త్వరలో రూపొందించి ప్రకటించనున్నట్లు తెలిపారు.


13. నిరంతర విద్యుత్ సరపరా: గతవారములో -  రాష్ట్రములో అన్నీ గృహ సముదాయాలకు వ్యవసాయానికి పరిశ్రమలకు ప్రతిరోజు జిల్లా కెంద్ర పట్టణాల్లో 24 గంటల నిరంతర విద్యుత్ సరపరాకు, బుందేల్ ఖండ్ లాంటి వెనుకబాటు తనమున్న ప్రాంతములోనూ, తహసీళ్ళ పరిదిలో రోజుకు 20 గంటల నిరంతర విద్యుత్ సరపరాకు, గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 18 గంటల విద్యుత్ సరపరాకు కెంద్రం తో అంగీకారపత్రంలో సంతకం చేసారు యోగీ ఆదిత్యనాద్. ఇదంతా నవంబర్ 2018 వరకే పూర్తయ్యే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.


14. విద్యాసంస్థల్లో రుసుం (ఫీజ్) నియంత్రణ & పర్యవేక్షణ: రాష్ట్రంలో ఉన్న అన్నీ విద్యాసంస్థలు తమ ప్రస్తుత విద్యా రుసుము వసూల్ చేసే విధానాన్ని ప్రభుత్వానికి సమర్పించాలని. తరవాత తాము నూతన ఫీజ్ విద్యార్ధు ల నుండి వసూల్ చేసే విధి విధానాలను  నియంత్రణను పర్యవేక్షణ విధానం పై అధ్యయనం చేసి నిర్ణయంతో ముందుకు వస్తామన్నారు.    


15. ఆరొగ్య వైద్య విధ్యాలయాల నిర్మాణం: రానున్న ఐదేళ్ళ కాలములో ఉత్తరప్రదేశ్ అవసరాలను అధిగమించటానికి 25 ఆరొగ్య వైద్య విధ్యాలయాలను నిర్మిస్తామని చెప్పారు.


Image result for up cm yogi adityanath



16. నామకరణం: ఐఏఎఫ్ టర్మినలుకు పండిట్ దీన్-దయాళ్ ఉపాద్యాయ పేరును నిశ్చయం చేశారు: తన పాలన ఒక మాసం ముగిసిన సంధర్భంగా మంత్రిమండలి సమావేశములో బిజెపి సిద్ధాంత కర్త ఆగ్రా లోని ఐఏఎఫ్ అయిర్-ఫీల్డ్ పౌర విమాన టెర్మినలుకు పెట్టే నిర్ణయం తీసుకున్నారు. అలాగే గోరక్-పూర్ లోని ఐఏఎఫ్ అయిర్-ఫీల్డ్ లోని పౌర విమాన ప్రయాణ ప్రాంగణ టెర్మినలుకు మాయాయోగి గోరక్-నాద్ పేరును నిర్ణయించారు. 

 

 Image result for up cm yogi adityanath

మరింత సమాచారం తెలుసుకోండి: