Related image



భారతీయ యువతకు అమెరికాలో మంచి విద్యా, ఉద్యోగ అవకాశాలు కలిగిస్తున్న వీసాల్లో  హెచ్ 1 బి ముఖ్యమైనది. అమెరికా లో అమెరికన్ల కంటే ఉన్నత స్థానాలను చేరుకునేందుకు ఈ వీసాలే నిచ్చెన మెట్లుగా భారతీయులకు ఉపయోగపడుటూ వచ్చాయి. భారతీయులే కాదు విదేశీయుల అభివృద్దిని సహించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బి వీసాలకు రకరకాల ఆంక్షల తో వాటికి కోత పెడుతున్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాన్ని కూడా పెట్టేశారు. 


అత్యున్నత నైపుణ్యం ఉన్నవారికి హెచ్ 1 బి వీసాలు లభించేలా చట్టాలను మార్చేశారు. తక్కువ జీతాలకు పనిచేసే భారతీయులనే కాదు ఏఇతర దేశస్తులనూ నియమించు కునేందుకు ఉన్న అవకాశాలన్నింటిని తొలగించారు. ఇమిగ్రేషన్ కు సంబంధించి కూడా చాలా చర్యలను తీసుకునేందుకూ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇలా అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న అమెరికాను గమనించిన ఆస్ట్రేలియా కూడా అదే దారిలో తన నడకను ప్రారంభించింది.

 

Image result for donald trump malkam turnable



ఆస్ట్రేలియాలోని ఉద్యోగాలు తొలుత ఆస్ట్రేలియన్లకే దక్కాలన్న ఉద్దేశంతో "వర్క్ వీసా" లను రద్దు చేస్తున్నట్టు ఆదేశ ప్రధాని "మాల్కం టర్న్‌బుల్" సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాలో విదేశీయులు ఉద్యోగం చేసేందుకు వీలు కలిపించే 457 వీసాని రద్దు చేసి, దాని స్థానంలో మరో కఠినమైన కొత్త విసా విధానాన్ని తీసుకురానున్నట్టు టర్న్‌బుల్ చెప్పారు. 


దీని స్థానంలో రానున్న విసా విధానానికి ఇంగ్లిష్‌ భాష లో అధిక ప్రావీణ్యం, ఉద్యోగ నైపుణ్యాలు అవసరమయ్యే కొత్త కార్య క్రమాన్ని తక్షణం తీసుకు రానుంది ఆస్ట్రేలియా. 457 వీసాల  రద్దు ప్రక్రియను 2018 మార్చి నాటికి ఎలాంటి పరిస్థితులలో
నైనా పూర్తి చేయనున్నారు.  ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 457 వీసాపై దాదాపు మొత్తంగా 95 వేల మంది విదేశీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో అత్యధికులు భారతీయులే కావ‌డం గ‌మ‌నార్హం. అమెరికా చర్యలతో అక్కడి ఎన్‌ఆర్‌ఐ లు పెద్ద ఎత్తున నష్టపోతుండగా, తాజాగా ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ నిర్ణయం కూడా ఉపాది పొందుతున్న భారతీయ యువతకు తీవ్ర శరాఘాతమే అయి ధారుణమైన ఎదురుదెబ్బగా మారనుందని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 


ఈ మద్యనే భారత్‌ లో పర్యటించి, జాతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేకపోరు, విద్య, ఇంధన మొదలైన అనేక కీలక రంగాల్లోని అంశాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్న అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ నుంచి ఈ ప్రకటన వెలువడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 



Image result for australia 457 visa consultants in india 


ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ "మాది వలసల దేశం. కానీ, ఆస్ట్రేలియా ఉద్యోగాల్లో ఆస్ట్రేలియన్లకు ప్రాధాన్యం ఉండాలి. అందుకే విదేశీయులను మా దేశంలో నియమించుకునేందుకు ఉద్దేశించిన 457 వీసాను రద్దు చేయాలని నిర్ణయించాం" అని చెప్పారు. 


"ఆస్ట్రేలియన్లకు చెందవలసిన ఉద్యోగాలకు ఇకపై 457 వీసాలను అనుమతించబోరని చెప్పారు. అత్యధిక నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే తీసుకునేలా ఆస్ట్రేలియా ఫస్ట్ అనే కొత్త కార్యక్రమాన్ని మేం తీసుకోబోతున్నాం" అని ప్రధాని వివ రించారు. నాలుగింట ఒక వంతు భారతీయులే ఈ 457 వీసా కింద ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు పొందుతుంటారు. 


Image result for australia 457 visa consultants in india


తర్వాత వరుస గా బ్రిటన్ (19.5%), చైనా (5.8%) ఉన్నాయని ఏబీసీ వార్తా సంస్థ పేర్కొంది.  గతేడాది సెప్టెంబర్ నెలాఖరు నాటి లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలో 457 ప్రైమరీ వీసాల కింద 95,757 మంది పనిచేస్తున్నారు. మరో 76,430 మంది సెకండరీ వీసా హోల్డర్లు (ప్రైమరీ వీసా హోల్డర్ల కుటుంబ సభ్యులు) ఉన్నారని ఏబీసీ నివేదిక పేర్కొంటుంది. 


ఇన్నాళ్లూ విదేశస్తులకు ఉపాధి అవకాశాలు కొనసాగించిన అమెరిక ఆస్టృఏలియాలు ఒకేసారి దారులన్నీ మూసేసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో, అమెరికాతో పాటు, ఆస్ట్రేలియాపై ఆశలు పెట్టుకున్నవాళ్ల పరిస్థిటి కూడా అగమ్యగోచరంగా తయారైంది.


Image result for australia 457 visa consultants in india

మరింత సమాచారం తెలుసుకోండి: