ఇటీవల ఏసీబీ అధికారులకు చిక్కున ఏపీ అధికారి జగదీశ్వర్ రెడ్డి అవినీతి సంపాదన తలపండిన ఏసీబీ అధికారులను కూడా కంగుతినిపిస్తోంది. ఇప్పటికే వంద కోట్ల రూపాయలు దాటిపోయిన ఆయన అవినీతి సంపాదన ఇంకా పూర్తి లెక్కలు తేలాల్సి ఉంది. హైదరాబాద్ లోని లాకర్లు తెరుస్తున్న అధికారులకు.. అవి నగల షాపులను తలపిస్తూ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. 



జగదీశ్వర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ విద్యా సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చీఫ్‌ ఇంజినీర్‌ గా పని చేస్తున్నాడు. ఈయనకు చెందిన హైదరాబాద్ లోని రెండు లాకర్లను ఏపీ అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.పి.ఠాకూర్‌ ఆదేశాల మేరకు ఏసీబీ స్పెషల్ టీమ్ తెరిచి చూసింది. ప్రత్యేక విభాగం డీఎస్పీ రమాదేవి పర్యవేక్షణలో బృందం ఈ లాకర్ల తనిఖీ చేసింది. 


ఇప్పటికే జగదీశ్వర్‌రెడ్డి బంధువుల ఇళ్లల్లో తొమ్మిది చోట్ల సోదాలు చేసిన అధికారులకు 100 కోట్లకు పైగా అవినీతి సొమ్ము కూడబెట్టనట్టు తేలింది. తాజాగా హైదరాబాద్‌ బాగ్‌ అంబర్‌పేటలోని ఆంధ్రాబ్యాంకులో ఆయనకు సంబంధించిన రెండు లాకర్లు తెరిచారు. ఈ లాకర్లలో 35 లక్షల రూపాయల నగదు కనిపించింది. దాంతో పాటు అనేక నగలు కళ్లు జిగేల్ మనిపించాయి.


అనేక బంగారు ఆభరణాలు, వజ్రాలు, వైఢూర్యాలు పొదిగిన నగలు ఏసీబీ అధికారులకు షాక్ ఇచ్చాయి. అవి లాకర్ల నగల దుకాణాల కౌంటర్లా అన్నట్టుగా తయారైంది పరిస్థితి. దాదపు రెండు కిలోలకు పైగా బంగారు నగలను అధికారులు గుర్తించారు. ఇంకా మరికొన్నిలాకర్లు తెరవాల్సి ఉంది కూడా. మరి ఆ లాకర్లు కూడా తెరిస్తే అయ్యవారి అవినీతి ఖజానా ఇంకెంత బయటపడుతుందో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: