chennai metro rail tunnel chemicals flowed on roads కోసం చిత్ర ఫలితం



చెన్నై మహానగరం భూగర్భం నుండి నిన్న తెల్లవారు ఝామున భయంకరమైన శబ్ధాలతో భీభత్సం వాతావరణం ఏర్పడింది. మెట్రో రైలు టన్నెల్ మార్గ నిర్మాణం దాని తవ్వకపు పనుల కారణంగా ఇక్కడ వాషర్‌మెన్ పేటలోని ఒక వీధిలో గురువారం భూకం లాగా భూమి బద్దలైనట్లు పెద్ద పెద్ద శబ్ధాలతో  సిమెంట్‌, ఇసుక తో పాటు  ఇతర రసాయనాల మిశ్రమాలు పొంగి రహ దారులపై  నల్లని లావాలా ప్రవహించాయి. ఆరు ఇళ్లను ఈ రసాయన మిశ్రమాలు ముంచెత్తాయి. దీనితో ఇళ్లలోని వారంతా ప్రాణభయం తో పరుగులు తీశారు. ఇళ్లల్లో, వీధిలో నల్లటి రంగులో సిమెంట్‌ మిశ్రమాలు ఏరులై పారాయి. 


అయితే వీటిని గురించి పరిశీలన జరపగా తెలినదేమంటే "వాషర్‌మెన్ పేట నుండి వింకోనగర్‌" దాకా ఉన్న 9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ కోసం టన్నెల్ (సొరంగ మార్గం) నిర్మాణం కోసం త్రవ్వకాలు జరుతున్నాయి. ఈ పరిషితుల నేపథ్యంలో "ఈస్ట్‌ ముత్తయ్య వీధి" లో మహమ్మద్‌ యూసఫ్‌ అనే వ్యక్తి కి చెందిన మూడంతస్థుల భవన సము దాయంలో ఆరు కుటుంబాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఆ భవనం పక్కనే మరో మూడు ఇళ్లు ఉన్నాయి. గురువారం తెలవారు ఝామున మహమ్మద్‌ యూసఫ్‌ ఇంట్లో ఉన్నట్టుండి భూకంపం వచ్చినట్లు భళ్ళున ఏదో ప్రేలినట్లు పెద్ద ధ్వని వినిపించింది. ఆ శబ్దానికి నిద్రపోతు న్న ఆ ప్రాంత ప్రజలన్తా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ఏదో ప్రళయం వచ్చినట్లు అనిపించింది వారికి. 


chennai metro rail tunnel కోసం చిత్ర ఫలితం




క్రిందకు దిగివచ్చి చూడగా నల్లటి సిమెంట్‌ మిశ్రమం బురద లా నలువైపులా పారుతుండటాన్ని చూసి అసలిదేంటో అర్ధం కాక బిత్తరపోయారు. మహమ్మద్‌  యూసఫ్‌ ఇంటి పక్కనే ఉన్న ఐదారిళ్ళలోనికీ సిమెంట్‌ రసాయనాల మిశ్రమం ప్రవేశిం చింది. షరీఫ్‌ అనే మరో వ్యక్తి ఇంటి లోపల మూడడుగుల ఎత్తున నలుమూలలా వ్యాపించి మేట వేసింది. ఆ ప్రాంతం లో భూమి దిగువన జరుగుతున్న మెట్రో రైలు టన్నెల్ వె (సొరంగ మార్గం) నిర్మాణ పనులలో చోటు చేసుకున్న తప్పిదం వల్ల భూగర్భం నుంచి ఈ మిశ్రమం వత్తిడికి గురై పై తన్నుకొని వచ్చి ఒక్కసారిగా పెల్లుబుకిందని తెలిసింది.



దీంతో అప్పటి కప్పుడే అక్కడి నివాసితులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న మెట్రో రైల్‌ అధికారులు, పోలీసులు వెనువెంటనే ఆఘమేఘాల మీద  అక్కడి కి పరుగున వచ్చి ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరిపారు. ఆ లోగా మెట్రో రైలు కార్మికులు, స్థానిక యువకులు ప్లాస్టిక్‌ డ్రమ్ములతో ఆ సిమెంట్‌ రసాయనాల మిశ్రమా లను అక్కడ నుండి తొలగించటానికి వారు సాయంత్రం వరకూ వారు శ్రమించవలసి వచ్చింది. ఈ సంఘటనపై మెట్రో రైలు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, సొరంగం తవ్వకాల్లో ఒత్తిడి తట్టు కోలేక సిమెంట్‌ మిశ్రమాలు రోడ్డుపైకి ఎగబడటం తరచూ జరుగుతుందని, దీనికి నగరవాసులు భయపడవలసిన అవసరం లేదని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: