గత కొంత కాలంగా తెలుగు దేశం పార్టీలో అంతర్గత కలహాలు బాగా పెరిగిపోతున్నాయి. అంతే కాదు ఈ మద్య కెబినెట్ విస్తరణ తర్వాత సీనియర్ టీడీపీ నాయకులు అలక పాన్పు ఎక్కి కూర్చున్న విషయం తెలిసిందే.  తెలుగు దేశం పార్టీకి తాము ఎప్పటి నుంచో సేవ చేస్తున్నామంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మరో వైపు ప్రతిపక్షం వారు ఏ చిన్న చాన్స్ దొరికినా చీల్చి చెండాడుతున్నారు.  

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో పని మీద దృష్టి పెట్టాలంటూ చురకలు అంటించారు. అమరావతిలో ఈ రోజు టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న పార్టీ నాయకులు కొందరు మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించాక అధికారుల్లో మరింత చలనం వచ్చిందని అన్నారు.

ఇక పెద్దాయనను ప్రసన్నం చేసుకోవడానికి చినబాబును తెగ పొగిడిన నేతలను ఉద్దేశించి చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ భేటీలో లోకేశ్ కూడా పాల్గొనడం గమనార్హం.   గ్రామ కమిటీ ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని, సంస్థాగత ఎన్నికల నిర్వహణ విషయంలో ఇన్ చార్జ్ మంత్రులు చొరవ తీసుకోవాలని లోకేశ్ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: