"పప్పు ఆంద్రప్రదేశ్ - అని గూగుల్ లో టైప్ చేస్తే లోకేష్ బొమ్మ వస్తోందని" వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెప్పారు.ఇందుకు తాము ఏమి చేయగలమని ఆయన అన్నారు. సామాజిక మాద్యమాన్ని అదుపు చేయాలని ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు. "గూగుల్ ను నియంత్రిస్తారా!" లేక "గూగుల్ ను అరెస్టు చేస్తారా!" అని ఆయన ప్రశ్నించారు. 


సామాజిక మాద్యమాన్ని తన అదుపులోకి తెచ్చుకోవాలని తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవాలని చంద్రబాబు చేస్తున్న యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఈ మాద్యమం "ఏ ఒక్కరి సొత్తో, ఒక కులం సొత్తో కాదని" అన్నారు. గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ మోహన్ రెడ్డి పై సామాజిక మాద్యమం లో దారుణమైన దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు సామాజిక మాద్యమానికి భయపడి దానిని అణచి వేయాలని చూస్తున్నారని, వైసిపి ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. 


అప్పటికి ఇప్పటికి ప్రజలలో చైతన్యం బాగా వచ్చిందని గుర్తించాలని కరుణాకరరెడ్డి అన్నారు.నిజంగానే ఇది ఆశ్చర్యంగానే ఉంది. అయితే లోకేష్ పై ఎవరో ఇలాంటివి పోస్టు చేసి ఉండాలి. ఇది కూడా మంచిది కాదు. కాని అదే సమయంలో టిడిపి ప్రభుత్వం సామాజిక మాద్యమాన్ని అదుపు చేయాలనుకుని చేసే ప్రతి ప్రయత్నమూ ప్రజలకు రాజ్యాంగమిచ్చిన భావవ్యక్తీకరణ స్వేచ్చను హరించటమేనన్నది గ్రహించక మరింత తప్పు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో కులచిచ్చు పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం, భావస్వేచ్చను హరించే పనిలో పడిందని" భూమన విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల గొంతుకు కళ్లెం వేయాలని చూస్తోందని భూమన అన్నారు.


ప్రజలు చైతన్యవంతులు అయినందున, ప్రజల్లో స్పస్టమైన అవగాహన ఉన్నందున చంద్రబాబుకు సామాజిక మాద్యమం భజన చేయదు. అందుకే తనపై విమర్శల జడివాన కురిపించే సోషల్ మీడియా పనిపట్టాలనుకోవటమే కాదు దానిని కట్టడి చేయాలను కోవటమూ "అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంటిని ఆపటానికి ప్రయత్నించటమే అవుతుందని" అంటున్నారు. 


భూమన వ్యాఖ్యలతో నెటిజెనులంతా "పప్పు అంధ్రప్రదేశ్" అని గూగిల్ లో టైప్ చేసి చూసి నవ్వుకోవటం హాస్యాస్పద మౌతుంది. "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, టిల్ ది ట్రబుల్, ట్రబుల్స్ యు" అలాచేస్తే గెలుక్కొని వాసన చూసుకోవటమే నని నెటిజనులంతా వ్యాఖ్యానిస్తున్నారప్పుడే.   

మరింత సమాచారం తెలుసుకోండి: