గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద సంచలనాన్ని కలిగించిన అయేషా మీరా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే, సత్యం బాబు సెషన్స్ కోర్టు తీర్పును తప్పుబడుతూ హై కోర్టుకు అప్పీలు చేసుకున్నప్పుడు అందరూ కూడా హై కోర్టు సెషన్స్ కోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరిస్తుందని అందరూ ఊహించారు. కానీ ఎవరి ఊహలకు అందని విధంగా హై కోర్టు సత్యంబాబు నిర్దోషి అని తీర్పు వెలువరించింది. అయితే ఇప్పుడు అసలు నిందితులకు వెతికి పట్టుకోవడానికి ప్రభుత్వం ఈ కేసును సీబీఐ కి అప్పగిస్తుందా..?


Image result for ayeshamurder case cbi

లేక సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకుంటుందా..? అనే విషయం లో మాత్రం ఇంకా స్పష్టత రావటంలేదు. . అయితే ఈ కేసును సీబీఐ స్వీకరిస్తుందా? లేదా? అన్న సంశయం పోలీసులను పట్టిపీడిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సర్కారు అనుమతిచ్చినా కోర్టు ఆ పిటిషన్‌ను స్వీకరిస్తుందా? అన్న అనుమానాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. 


Image result for ayeshamurder case cbi

ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నా ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయ నిపుణులతో అధ్యయనం చేయించిన తర్వాతే ఈ విషయంలో అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.మరోవైపు అయేషా తల్లిదండ్రులు కనుక అంగీకరిస్తే కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: