Related image



అమెరికా, రష్యాల వద్ద ఉన్న వాటికంటే అత్యంత శక్తిమంతమైన బాంబులు భారత్ వద్ద ఉన్న సంగతి చాలా కొద్దిమందికే తెలుసు. సీఎల్-20 పేరుతో ఏడేళ్ల క్రితం డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ బాంబు సంప్రదాయ పేలుడు పదార్థాల కంటే 15 రెట్లు శక్తిమంతమైనది. అణు రహితమైనది. ఈ బాంబును ఎలా ప్రయోగిస్తారన్న విషయం రహస్యంగా ఉన్నా ఇది అమెరికా వద్ద ఉన్న "మదరాఫ్ ఆల్ బాంబ్స్", రష్యా వద్ద ఉన్న "ఫాదరాఫ్ ఆల్ బాంబ్స్" కంటే కూడా చాలా శక్తిమంతమైనది. అంతే కాదు ఈ బాంబు ప్రయోగం వల్ల రేడియేషన్ కూడా వ్యాప్తిచెందదని సమాచారం.


అయితే రేడియేషన్‌ విడుదల చేయని అతి శక్తిమంతమైన "మాసివ్‌ ఆర్డినెన్స్‌ ఎయిర్‌ బ్లాస్ట్‌ బాంబ్‌" (ఎంఓఏబీ) ఆప్ఘనిస్తాన్‌లోని తీవ్రవాదుల శిబిరాలపై స్ధావరంపై ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఈ బాంబుకు మరో పేరు పైన వివరించినట్లు "మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌". అమెరికా బాంబు దాడిలో దాదాపు 100 మంది ఐసిస్ తీవ్రవాదులు హతం కావడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


దీంతో రష్యా తమ వద్ద మధర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కంటే శక్తివంతమైన "ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌" ఉందంటూ రష్యా పేర్కొంది. బలమైన సందేశాన్ని ప్రపంచానికి ప్రత్యేకించి అమెరికాకు పంపింది.


A mock-up of a the Tsar Bomba is displayed at an exhibition in Moscow




అయితే, అసలు రేడియేషన్‌ కలిగించని శక్తిమంతమైన బాంబు ఎవరి దగ్గర ఉంది అనే ప్రశ్న ఉదయించింది అంటే భారత్ దగ్గర అన్నమాట. అవును భారత్‌ వద్ద అసలు రేడియేషన్‌ ఏమాత్రమూ విడుదల చేయని శక్తిమంతమైన బాంబు ఉంది. దీనిని మన  "డీఆర్‌డీవో - హైదరాబాద్"  ఆరేళ్ల క్రితమే అభివృద్ధి చేసింది. దాని పేరు "సీఎల్‌-20", సాంప్రదాయ పేలుడు పదార్ధాల కంటే 15 రెట్లు శక్తిమంతమైన బాంబు ఇది. అయితే, దీనిని ఎలా ప్రయోగిస్తారు అనే విషయం మాత్రం టాప్-సీక్రెట్‌.  



Image result for C L 20 bomb

 


భారత్ వద్ద "సీఎల్-20" తో పాటు "స్పైస్ " అని పిలవబడే "స్మార్ట్ ప్రిసైజ్ ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్" అనే మరో శక్తిమంత మైన బాంబు కూడా ఉంది. ఈ బాంబుకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. మిరేజ్ 2000, సుఖోయ్ జెట్ల నుంచి కూడా చాలా సుల భంగా ఈ బాంబును ప్రయోగించవచ్చు. ఘట్టిగా మాట్లాడితే కార్గో విమానాల నుంచే ప్రయోగించవచ్చు. ఇజ్రాయెల్‌కు చెందిన "రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే సంస్థ ఈ బాంబును అభివృద్ధి చేసింది. ఉగ్ర స్ధావరాల నేల మట్టం చేయాలనుకున్న సమయంలో, సర్జికల్‌ స్ట్రైక్స్‌ లాంటి వాటిని ఎయిర్‌ఫోర్స్‌ ద్వారా నిర్వహించాలనుకుంటే, మనతొలి చాయిస్ కేవలం 1000 కిలోల బరువుండే "స్పైస్‌" మాత్రమే. దీన్ని భారత్‌ ఉపయోగించుకునే విధానం సంధర్భం అతి రహశ్యమే. అందుకే "మాస్టర్ & గాడ్ ఆఫ్ ఆల్ బాంబ్స్" అనవచ్చా! 


Image result for C L 20 bomb

మరింత సమాచారం తెలుసుకోండి: