సోషల్ మీడియాలో పొలిటికల్ పంచ్ అనే ఫేస్ బుక్ పేజీ నిర్వహిస్తూ అరెస్టయిన రవికిరణ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయన్ను ఇంటూరి రవికిరణ్ గా గుర్తించారు. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి పొలిటికల్ పంచ్ సుపరిచితమే. ఐతే.. పార్టీలు, నాయకులపై సెటైర్ల మాట ఎలా ఉన్నా.. శాశనసభను కించపరచడం ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టింది.

Image result for political punch RAVIKIRAN
శాసనసభ పై పెద్దలకు మాత్రమే అనే బోర్డు పెడుతూ రవికిరణ్ చిత్రాన్ని రూపొందించారు. అంతే కాకుండా అసెంబ్లీ ముందు పోర్న్ సినిమా వాల్ పోస్ట్ అతికించి ఏ గుర్తు వేశారు. నాన్నానేను ఆ పెద్దల సభకే వెళ్తా అని లోకేశ్ చంద్రబాబుతో అంటున్నట్టు అసభ్యంగా చిత్రం రూపొందించి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ అసెంబ్లీ కార్యదర్సికి ఫిర్యాదు చేశారు. 

Related image
ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఇది ఇంటూరి రవికిరణ్ చేసిన పనిగా తేల్చారు. ఆయన్ను శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ ఆదర్శకాలనీలో తెల్లవారుజాము మూడున్నరకు అరెస్టు చేశారు. శాసన మండలి కించపరిచేలా ఉన్న చిత్రాన్ని తానే రూపొందించానని రవికిరణ్ అంగీకరించినట్టు తెలుస్తోంది. తనకు వైసీపీ అంటే అభిమానమని రవికిరణ్ చెప్పారట. 

Image result for SOCIAL MEDIA
అంతే కాదు.. తాను వైసీపీ డిజిటల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నానని.. వ్యంగ్య చిత్రాలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటానని రవికిరణ్ పోలీసుల ముందు ఒప్పుకున్నారట. ఈ పని చేసినందుకు తనకు పారితోషకం ఇస్తారని రవికిరణ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన కుటుంబం మాత్రం రవికిరణ్ ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారంటూ శంషాబాద్ లో కేసుపెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: