అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ .. ఇంగ్లీషు భాష నేర్చుకునేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ వయసులో, అదీగాక .. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ‘ఇంగ్లీషు’ నేర్చుకోవాలనే ఆలోచన ఆమెకు ఎందుకు కలిగిందనే అనుమానం తలెత్తకమానదు. అయితే దీని వెనకాల అసలు కారణం ఉందండోయ్.. రాష్ట్ర రాజకీయాల్లో రాణించాలంటే స్థానిక భాష వస్తే సరిపోతుంది. కానీ దేశ రాజకీయాల్లో రాణించాలంటే మాత్రం ఆంగ్లం పై పట్టు ఉండాల్సిందే.


Image result for shashikala

ఎందుకంటే దేశంలో ఉండే ప్రధాన నాయకులంతా కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటారు కాబట్టి. అయితే చిన్నమ్మ తన విన్నపాలను వినిపించుకోవడానికి కేంద్ర మంత్రులతో మాట్లాడడానికి ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారట. అమ్మతో అన్ని విషయాల్లో సమానంగా ఉన్న ఇంగ్లీష్ లో మాత్రం శశికళ చాలా వీక్ అట.  కేంద్రంలో చక్రం తిప్పాలన్నా... జాతీయ పార్టీ నేతలతో రాయభారం నడపాలన్న ఇంగ్లీష్ వచ్చితీర్సాల్సిందే.


Image result for shashikala

ఈ విషయంలో జయలలిత చాలా ఫాస్ట్. తమిళంతో పాటు ఆమె ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడగలరు. కానీ, శశికళ అలా కాదు. 10 వ తరగతితోనే బడిమానేసిన చిన్నమ్మకు తమిళతప్ప ఇంకో భాష కూడా రాదు. అదే ఇప్పుడు ఇబ్బంది మారినట్లు తెలుసుకుంది. అందుకే తాను శిక్ష అనుభవిస్తున్న జైళ్లోనే ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ఓ ట్యూటర్ ను కూడా పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: