socal media కోసం చిత్ర ఫలితం


ఏదైనావార్త,ఉపన్యాసం వింటే విశ్లేషించటం, విమర్శించటం, ప్రశ్నించటం, వ్యంగ్యంగా మాట్లాడటం, జోక్ చేయటం, తప్పులు పట్టటం, నిలదీయటం,  ఇవన్నీప్రజాస్వామ్యరాజ్యంలో సహజం.


ఇవి సహజ స్పందనలుగా వాటంతట అవే వస్తాయి. అది వ్యతిరేకుల నుండి కావచ్చు, స్వపక్షం నుండి  కావచ్చు, విపక్షం నుండి కావచ్చు, ఏ మాత్రం సంబందంలేని వారినుండి కావచ్చు. కొందరు కావాలని విమర్శించినా ప్రజాస్వామ్య రాజకీయాల్లో భరించాల్సిందే.


 "ప్రజా జీవితములో అడుగు పెట్టిన మరుక్షణం నీ జీవితం నీది కాదు" అన్నారు మహాకవి శ్రీ.శ్రీ.



socal media కోసం చిత్ర ఫలితం

ఈ విషయములో ఈ చర్చ ఎందుకంటే సోషల్ మీడియాపై ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగుదేశం ప్రభుత్వం  ఉక్కుపాదం మోపాలని చర్చల మీద చర్చలు జరపటం."అసలు తెనెతెట్టెని కదపటమే తప్పు, ఆ తరవాత  తెనెటీగల గాట్లను  ఆపటం ఎవరి తరం?"  


అంధ్రప్రదేశ్ తెలంగాణాలో ఇద్దరు చంద్రుల ముద్దుల ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలుకావు అని ఘంటాపధంగా చెప్పటానికి సంకోచించవలసినఅవసరం లేదు. అంతకు మించి కుటుంబ పాలనలు వెల్లివిరుస్తున్న రాజ్యాలయ్యాయి. సంకోచం లేకుండా కుటుంబపాలన సమర్ధించే నాయకత్వాలే రెండురాష్ట్రాల్లో ఉన్నాయి. నియంతృత్వం పాలన నిండా కమ్ముకుంది.



socal media కోసం చిత్ర ఫలితం




తెలంగాణాలో టిఆరెస్ ప్రభుత్వ పాలన తొలిదినాల్లోనే ఏబిఎన్, టివి 9 చానళ్ళను పదిమైళ్ళ లోతున పాతేస్తానన్న కేసిఆర్ పై దేశవ్యాప్తంగా మీడియాలోను ప్రజల్లోనిరసన వ్యక్తమైంది. అలాంటి అనుభవమున్న ఆ మీడియా ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతానన్న ప్రభుత్వ అలోచననను సమర్ధిస్తూచర్చలు డిబేట్లు నిర్వహిస్తున్నాయి. 



మరి తాము తెలంగాణా ప్రభుత్వ ఉక్కుసంకెళ్ళ నుండి బయట పడాలని కోరిన ప్రజలు ఇప్పుడీ మీడియా, వైచిత్రిని ఎలా గౌరవిస్తారు? రెండు రాష్ట్రాల్లోని ప్రధాన మీడియా అధికార పార్టీల తొత్తులే అని తెలుస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ మీడియా నిష్పాక్షికంగా వార్తలు రాసేసి చానా కాలమైంది.  


అధికార పార్టీలు రెండు చోట్లా కుల, ప్రాంత ప్రాతిపధిక పైవర్ధిల్లుతున్నాయి. సాంద్రత మాత్రమే తేడా. రెండు చోట్లా కులం, ప్రాంతం, అస్మదీయులు, తనవాళ్ళు, తనకుటుంబం, తన బందువులు, తన మిత్రులు, తనకుకమీషన్లు పంచేవారు ఇవి ఇలాంటివే "బేసిక్స్"  గా మీడియా, ప్రభుత్వాలు ఒక బండికి జోడెడ్లుగా కలసి నడుస్తున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉభయ రాష్రాలలో తలసరి ఋణ భారం ధారుణంగా పెరిగిపోతుంది. అది తెలంగాణాలో అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పెరుగుదల అత్యధికం. అంతే కాదు ఈ ముఖ్యమంత్రులు తమ వందిమాగధులతో ప్రజలకు ఇచ్చే ఉచిత గృహాలు, పశివిలి, పక్షులు, నిరుద్యోగ భృతి, మహిళలకు వృద్ధులకు పెన్షణ్లు అంతా వారే ఇస్తున్నట్లు చెప్పిస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి వారి స్వంత ఖాజానా నుండి ఏవరికైనా "చాయి" కూడా పోయించరు. పైసా పైసా కు తమకేమొస్తుందో తమ పార్టీకో తమ వాళ్ళకో లాభమో ప్రయోజనమో లేనిదే, ఒక్క కాగితం కదలదు ఒక పనీ కాదు. ఇవేవీ రెగ్యులర్ మీడియాలో రావు. 


మీడియా కూడా ఒక రాష్ట్రములో విమర్శిన దానిని మరో రాష్ట్రములో సమర్ధిస్తారు. అదీ రాజకీయనాయకుల లక్షణం. ఈ మీదియా,ఆ మీడియా అనేదేమీ లేదుమొత్తం ఉభయ రాష్ట్రాల్లో మీడియా రాజకీయ రంగు పులుముకొని బ్రతికేస్తుంది. అలాంటప్పుడు ప్రజలు తప్పక దిక్కులేక స్వతంత్రమై అవధులు లేని సోషల్మీడియాని ఆదరిస్తున్నారు.


ఉదాహరణకు కోడెల శివప్రసాద రావు అనే అనుభవమున్న రాజకీయ నాయకుడు శాసనసభాపతి తను ఎన్నికల్లో పదకొండు కోట్ల రూపాయలుఖర్చుపెట్టానన్నారు. ఆయన అన్నప్పుడు ఒక రంగు మీడియా అసలు ఆ వార్తే రాయలేదు. ఆ రంగుకే చెందిన మరో మీడియా ఒక రోజు ఆగి సాంద్రత తగ్గించి వార్తరాసింది. మీడియాకు నిభద్దతేది. ఎందుకంటే వీళ్ళెప్పుడైనా నిజం చెప్పినా "నాన్నా పులివచ్చె అనే కథలో లాగా నిజంగా పులివచ్చిందన్నా ఎవరూ నమ్మలేనిపరిస్థితి తెచ్చిపెట్టాయి" వారి వ్యతిరెఖ రంగుమీడియా వార్తకు ముదురు రంగులు పూసి మరీ ఎక్కువ రాస్తుంది.


socal media కోసం చిత్ర ఫలితం



ఈ దరిద్రానికి కారణం ఈ  డిబేట్లు  చర్చలు పెట్టే దౌర్భ్యగ్యపు మీడియా  కాదా!  
"గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకునే పరిస్థితి ఈ ఉభయ రాష్ట్రాల ప్రజలది"
"పదుగురిలో పడ్డ పాము చావదూ, ఆగదూ"  అన్నట్లు సొషల్ మీడియానే నమ్మే రోజులు రావటంతో వార్త సమాచారంగా కాక , దావానలంగా మారి ఈ మొత్తం పాపానికి కారణమైన రాజకీయ బ్రోకర్గాళ్ళ మెడకే చుట్టుకుంటుంది.


పాపాత్ములకే అవమానాలు చీత్కారాలు. మామూలు ప్రజలకెమి భాధ్యత. అసలు ఇంత చికాకుకు కారణం ఆంధ్తప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన తనయులు కాదాకారణం. అసమర్దులకు పాలన ఇస్తే ఏం చేయాలో తెలియక ఏమైనా చేస్తారు. నవ నందులు, కాంబోజరాజు కొడుకులు, కురుపుత్రులు చాలదా ఉదాహరణకు.


లోకేష్ కుమారునికి అధికారం ఇచ్చేముందు సరైన శిక్షణ ఇవ్వవలసిన ధర్మం ఉంది చంద్రబాబు గారికి. అది చేయలేదు ఒకవేళ చేసినా ఆయనకు ఆ శిక్షణఅబ్బలేదు. ఆయన సామర్ధ్యం అంతేనేమో! దాంతో మంత్రయ్యాడు ప్రజల్లోకి వచ్చి తానో పెద్దయనలా ప్రమాణ స్వీకారం చేయబోయారు. శ్రద్ధ ని శ్రద్ధాంజలిఅన్నారు. సార్వభౌమత్వాన్ని సార్వ...భౌ...భౌ అన్నారు. ప్రజలు నవ్వరా? మీరే చెప్పండి తప్పెవరిది?


డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని "వర్ధంతి" అనటమే కాదు దానికి శ్రద్ధాంజలి కూడా ఘటించారు. అలా ఇంకా కొన్ని. మీ మీడియాలో మీరెలాగు రాయలేదు. వెరేప్రతిపక్ష మీడియా విమర్శించినసి. సోషల్ మీడియా లో వార్త సమాచారం కాదు. దావానలమే. అది దహిస్తుంది. మొత్తానికి దీనికి కారణం ఎవరు. మీరు మీ మీడియామాత్రమే. మీ మీడియా రాయనప్పుడు మీ ప్రతిపక్ష మీడియాకు గుర్రు ఉండదా? వారి గురించి తప్పుడు రాతలు మీరు రాయలేదా? అప్పుడే బేరీజులు, పోలికలు,వ్యాఖ్యానాలు   ఉపాఖ్యానాలు, విమర్శలు విచ్చలవిడి ఔతాయి. తప్పు మీరు చేసి మీ అబ్బాయి అయితే మీకు ముద్దు ప్రజలకు అబ్బాయి కాదుగా వారికి ముద్దుఉండటానికి. మీరెలాగు రాయరని తెలియగానే తెనెతెట్టె కదిలింది తేనె టీగలగుంపు సొషల్ మీడియా ఝుయ్యు మంటూ వారతలు పెట్రేగుతాయి. మీరు తప్పుగామాట్లాడితే అది దావానలమై మిమ్మల్నే దహించి వేస్తుంది.


socal media కోసం చిత్ర ఫలితం



మీరు మిమ్మల్ని సవరించుకోండి అంతేకాని ప్రజల స్వాతంత్రియాన్ని హరించకండి.


సోషల్ మీడియాని అదుపు చేయటం సాధ్యమా? తేలికేనా? లోకేష్ బాబుకు తెలుగు రాకపోతే నేర్చుకోమనండి. నేర్పండి. స్తాన్-ఫోర్డ్ చదివారుగా ఇంగ్లీష్ లో మాట్లాడమనండి. అదీ రాదా!  అదీ కుదరకపోతే  రాజకీయాలు  మానేయమనండి.  మాకేం బాధ లేదు. సోషల్ మీడియా కాకపోతే అంతర్జాలాన్ని బందించగలరా?


విశ్వం లోనే ఏదో మూలనుండి ఏవరో ఏదో కామెంట్ చేస్తే దాన్నే వెతుకుతూ కాలక్షేపం చేస్తారా?


ఇని మానేసి ప్రజలగురించి వారి వెతలగురించి ఆలోచిస్తే మంచిది. అసలు మీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుగారికి గాని ఒడిసా ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్ గారికి గాని వారి వారి మాతృ భాషలు వచ్చా? రావు కదా? వారేమీ సోషల్ మీడియాని విమర్శించలేదే, దేబిరించలేదే, దానీపై ఉక్కుపాదం మోపలేదే సమయోచితంగా  ఆలోచించటం ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణం.


socal media కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: